నవతెలంగాణ – భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ముగ్గురు మృతి. చిట్యాల మండలం కైలాపూర్‌లో మిరపనారు నాటుతుండగా పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులను సరిత, మమతగా గుర్తించారు. కాటారం మండలం దామెరకుంటలో పిడుగుపడి రైతు మృతి చెందాడు. పొలం పనుల్లో నిమగ్నమైన రైతు రాజేశ్వర్ రావుపై పిడుగు పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.