టీఎస్పీఎస్సీ ఛైర్మెన్ మహేందర్‌ రెడ్డిని తొలగించాలి : ఎమ్మెల్సీ కవిత

నవతెలంగాణ-హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ఛైర్మెన్ మహేందర్‌ రెడ్డిని తొలగించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. పెద్ద యెత్తున మహేందర్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని  టీఎస్పీఎస్సీ ఛైర్మెన్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు కవిత. అవినీతి ఆరోపణలు వస్తున్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పైన జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ లో కరెంట్ కోతలు మొదలయ్యాయని కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర వాళ్ళని డైరెక్టర్ లను నియమించారు తెలంగాణకు నిరంతర కరెంట్ ఇవ్వటంలో వీళ్ళు ఎంత భాగస్వామ్యం అవుతారని నిలదీశారు. మీలో పచ్చ రక్తం పారుతుంది కాబట్టే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణ అసెంబ్లీకి ఆంధ్ర అడ్వైసర్ ఎందుకు? అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని నిలదీశారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్ర వారికి ఇస్తున్నారని ఆరోపణలు చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత.

Spread the love