ఓటు వేయడానికి వచ్చి ఇద్దరు మృతి

నవతెలంగాణ హైదరాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో ఓటు వేసేందుకు వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై మృతి చెందారు. మావలకు చెందిన తోకల గంగమ్మ(78) ఓటు వేయడానికి బూత్కు రావడంతో ఫిట్స్ వచ్చాయి. దీంతో ఆమెను రిమ్స్క తరలించే లోపే మృతి చెందింది. అదేవిధంగా భుక్తాపూర్కు చెందిన రాజన్న (65) ఓటు వేయడానికి వచ్చి వరుసలో నిలబడ్డాడు. అంతలోనే కళ్లు తిరిగి పడిపోవడంతో రిమ్స్్స్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Spread the love