చెట్టును ఢీకొట్టిన బైకు..ఇద్దరు దుర్మరణం

road-accidentనవతెలంగాణ-హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్ దగ్గర మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు చెట్టును ఢీకొట్టడంతో బైకుపై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులు సిద్ధాపూర్‌ తండాకు చెందిన కిషన్‌, సవాయిసింగ్‌గా పోలీసులు గుర్తించారు. కిషన్‌, సవాయిసింగ్‌ మంగళవారం ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Spread the love