నవతెలంగాణ-హైదరాబాద్ : వైసీపీ పార్టీకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ… మాగుంట కుటుంబం 34 ఏళ్లుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తోంది..మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారన్నారు. ప్రకాశం జిల్లా వాసులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వస్తున్నామని…మాగుంట కుటుంబానికి, ప్రజలకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని వివరించారు. ఈ 33 ఏండ్లలో 8సార్లు పార్లమెంట్ కి, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశాం..మా కుటుంబం కోరుకునేది కేవలం గౌరవమన్నారు. మాకు ఇగోలు లేవు..రాబోయే ఎన్నికల్లో మా కుటుంబం ఓ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. మా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీలో ఉంచాలని నిర్ణయించాం..ప్రస్తుత పరిణామాలు బాధాకరమని తెలిపారు. ఇది ఆత్మగౌరవానికి సంబందించిన విషయమని… అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడాలనుకుంటున్నాం…సీఎం జగన్ నుంచి కూడా ఈ ఐదేళ్ళలో సహాయ సహకారాలు అందాయని చెప్పారు. ఇప్పటివరకు సహకరించిన పార్టీ నేతలకు ధన్యవాదాలు అన్నారు. ఎంతో బాధతో పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నా..త్వరలో రాజకీయ భవితవ్యంపై నిర్ణయం ఉంటుందన్నారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి.