కనుకరించని ప్రభుత్వం పైగా అధికారులతో బెదిరింపులు


సమ్మె విరమించాలని ఆదేశాలు పట్టువీడని వీఓఏలు
వినూత్న రీతిలో నిరసనలు తమ సమస్యలు
పరిష్కారించాల్సిందేనని వీఓఏల డిమాండ్‌
స్వయం సహాయ సంఘాలకు సేవలందిస్తున్న వీఓఏలు 40 రోజులుగా సమ్మెబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూ తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఇన్నేండ్లు వీఏఓలతో వెట్టిచారికి చేయించుకున్న ప్రభుత్వం ఇప్పుడు వారి వైపు కన్నెత్తి చూడడం లేదు. వీఓఏలను కనుకరించకపోగా వారిపైనే అధికారులతో బెదిరింపులకు పాల్పడుతోంది. అయితే అధికారుల బెదిరింపులకు వీఓఏలు జంకడం లేదు. సీఐటీయూ ఆధ్వర్యంలో తమ పోరాటాన్ని మరింతా ఉధృతం చేస్తామని తేల్చి చెబుతున్నారు. ఈ నెల 29న సెర్ఫ్‌ ఆఫీసు ముట్టడించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒంటెద్దు పోకడాలకు పోకుండా తమ సమస్యలు పరిష్కరించాలని
వీఏఓలు కోరుతున్నారు.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 850 వీఓఏలు పనిచేస్తు న్నారు. రంగారెడ్డి జిల్లాలో 400 మంది ఉండగా, వికారా బాద్‌ 450 మంది గ్రామ సంఘంలో వీఓలుగా పనిచే స్తున్నారు. వీరంతా 20 ఏండ్లుగా సెల్ప్‌ హెల్ప్‌ గ్రూపులు, గ్రామ సంఘాలు ఇచ్చే అత్తేసరు అలవెన్స్‌లతో జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రూ. 3,900 అలవెన్స్‌ కూడా సకాలంలో వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం అలవెన్స్‌ సైతం నేరుగా వీఓఏలు వ్యక్తిగత ఖాతా లో జమ కాకుండా గ్రామ సంఘంలో జమ చేయడంతో ఆ డబ్బులు తీసుకోవడానికి నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి ఉంది. అయితే 20 ఏండ్లుగా పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఉద్యోగ భద్రత లేదు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి గ్రామ సం ఘంలో వీఓఏలను ఉంచాలా.. తీసివేయాలన్న తీర్మానాలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో వీఓఏలకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది.
పని ఎక్కువ పైకం తక్కువ..
గ్రామాల్లో వీఓఏలు చేయాల్సి పనుల కంటే అదనపు పనులు చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పబ్లిక్‌ మీటింగ్‌లకు జనసమీకరణలు చేయాల్సి వస్తోంది. పనులు మాత్రం టార్గెటేడ్‌ కానీ వారికి గుర్తింపు మాత్రం లేదు. ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజలోకి తీసుపోయేది వీఓఏలు మాత్రమే. దీనికి తోడు గ్రామ సం ఘాలలో కొత్త కొత్త యాప్‌ తీసుకువచ్చి సీసీ(కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు) చేయాల్సిన పనులు సైతం వీఓఏలకు అప్ప గిస్తున్నారు. దీంతో వీఓఏలకు అదనపు భారం పడుతోంది.
40 రోజులుగా సమ్మె
తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం అమలు చేయాలని వీఓఏలు 40 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రోజుకో తీరు వినూత్నంగా నిరసనలు చేపడుతున్నారు. వంటావార్పు, మహానీయుల విగ్రహాలకు వినతులు, మూతికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు, తదితర రీతిలో ఆందోళనలు చేపట్టారు. అలాగే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి సైతం తమ సమస్యలు పరిష్కారించాలని వినతిపత్రం అందజేశారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు సైతం తమ గోడును వెల్లబోసుకున్నారు. తమ సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. అయితే 40రోజులుగా సమ్మె చేస్తున్న వీఓఏలను ప్రభుత్వం కనుక రించడం లేదు. కనీసం వారి సమ్యలను వినే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదు. దీనికితోడు మండల సా ్థయి అధికా రులతో వీఓఏలను బెదిరింపులకు పాల్పడుతోం ది. సమ్మెను విరమించాలని లేదంటే చర్యలు తీసుకుం టామని హెచ్చరికలు జారీ చేయిస్తోంది. తమ గోడును పట్టించుకో వాల్సిన ప్రభుత్వమే అధికారులతో తమను బెదిరించడం ఏంటనీ వీఏఓలు మండిపడుతున్నారు. తమ హక్కుల సాధన కోసం ఎన్ని పోరాటాలకైనా సిద్ధమని తేల్చి చెబుతు న్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 29న సెర్ఫ్‌ రాష్ట్ర ఆఫీసును ముట్టడించేందుకు సిద్ధమవుతున్నా రు. ఈ లోపే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించా లని వీఓఏలు కోరుతున్నారు.
సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలి
నేను 19 ఏండ్లుగా వీఓఏగా పనిచేస్తున్న. నా కొలువుపై నాకు నమ్మకం లేదు. ఎప్పుడు తీసివేస్తారో తెలియని పరిస్థితి. ప్రతీ మూడు నెలలకు ఒక్కసారి నన్ను వీఓఏగా ఉంచాలా.. తీసివేయాలా అని గ్రామ సంఘంలో తీర్మానాలు చేస్తారు. పనులు మాత్రం ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్న దానిలో మేము భాగస్వాములం అవ్వాలి. కానీ మాకు ఉద్యోగ భద్రత ఉండదు. ఇది ఎక్కడి నాయం. సెర్ఫ్‌ పనులు చేస్తున్న మమ్మల్ని సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలి.
– శివలీల, వీఓఏ
వీఓఏలను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి
గ్రామ పంచా యతీ స్వయం సహాయక గ్రూప్‌లకు సేవలందిస్తున్న వీఓఏలను ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించాలి. ప్రస్తుతం వస్తున్న రూ.3,900 వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలి. సమ్మెలో ఉన్న వీఓఏల సమస్యలను ప్రభుత్వం గుర్తించి వెంటనే పరిష్కారించాలి.
– కవిత, వీఓఏ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు

Spread the love