దేశానికే ఆదర్శంగా హుస్నాబాద్ పట్టణ ప్రగతి..

– ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ రాష్ట్రంలో ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్యం, స్వచ్ఛత, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా గ్రామాలు, పట్టణ ప్రగతి సరికొత్త రూపు సంతరించుకుని హుస్నాబాద్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ 2014కు ముందు త్రాగునీరు కోసం బిందెలు పట్టుకుని మహిళలు బావుల దగ్గరికి, బోర్ల దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉండేదని అన్నారు. మహాసముద్రం గండి నిర్మించడంతో హుస్నాబాద్ ప్రాంతంలో భూగర్భజల నీటి వనరులు పెరిగి అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇవ్వడంతో నీటి సమస్య తీరిందని అన్నారు., హుస్నాబాద్ పట్టణాన్ని నగర పంచాయతీ నుండి మునిసిపాలిటీగా చాలా వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. హుస్నాబాద్ పట్టణంలో ఇండోర్ స్టేడియం రూ.1కోటి 50లక్షలు,డిగ్రీ కాలేజీ 2కోట్లు,ఉమెన్స్ హాస్టల్ 1 కోటి, టిటిసి భవనం1కోటి, డయాలసిస్ సెంటర్ రూ. 85 లక్షలు, ఓపెన్ జిమ్ 24 లక్షలు, ఎల్లమ్మ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ కోసం రూ 9 కోట్ల 50 లక్షలు,బస్తీ దావఖాన రూ.23 లక్షలు,సోషల్ వెల్ఫేర్ గురుకులం నకు 5 కోట్లు,ఎస్టీ గురుకుల 9 కోట్ల రూ.20లక్షలు, షాపింగ్ కాంప్లెక్స్ 1 కోటి 50లక్షలు,మున్సిపల్ కార్యాలయం రూ. 2 కోట్లు,పాలిటెక్నిక్ కాలేజీ 3కోట్లు, సిసి రోడ్లు & డ్రైనేజీలు 30 కోట్లు,డంపింగ్ యార్డ్ 1కోటి రూపాయలతో,డబుల్ బెడ్ రూం బీటీ రోడ్డు 1కోటి రూపాయలు, డబుల్ బెడ్ రూం లు 305. 20కోట్లతో, 80లక్షలు PR రోడ్లు, నర్సరీ 25లక్షలు,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 2కోట్లు,మిషన్ భగీరథ 27 కోట్లు రూపాయలతో అభివృద్ధి చేసుకున్నామన్నారు ‌. ఏసీపీ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, డిఈ ఆఫీస్, ఏడి ఎలక్ట్రికల్ ఆఫీస్, ఫైర్ స్టేషన్, సబ్ డివిజన్ ఆఫీస్ ఆర్ అండ్ బి సబ్ డివిజన్ ఆఫీస్, నేషనల్ హైవే సబ్ డివిజన్ ఆఫీస్, ఆఫీసులను నెలకొల్పుకున్నామని అన్నారు. హుస్నాబాద్ ఆసుపత్రి 30 పడకల నుండి 50 పడకల వరకు సామర్థ్యం పెంపు, మాతా శిశు సంరక్షణ కేంద్రం 12.6 కోట్లు అభివృద్ధి చేసుకోవడం జరిగిందని అన్నారు . హుస్నాబాద్ పట్టణానికి జాతీయస్థాయిలో రాష్ట్రస్థాయిలో అవార్డులు వచ్చాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ 2021 లో పట్టణం పారిశుద్ధ్యం నందు మెరుగైన ప్రతిభను కనపరిచి ఫాస్టెస్ట్ మూవర్స్ సిటీ అవార్డు సాధించడం జరిగిందన్నారు. 2022లో బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ అవార్డును సాధించడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాకుల రజిత వెంకన్న, ఎంపీపీలు లకవత్ మానస సుభాష్, మాాలోతు లక్ష్మీ బిల్లు నాయక్, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, మున్సిపల్ నైస్ చైర్మన్ అనిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love