ఉస్తాద్‌.. నయా షెడ్యూల్‌ షురూ..

Ustad.. New schedule Shuru..పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్ట్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంలో హీరో ఉపయోగించే ఆయుధాల న్నింటినీ రివీల్‌ చేస్తూ ఇటీవల దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఒక పోస్టర్‌ను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక గురువారం పవన్‌ కళ్యాణ్‌ షూట్‌లో జాయిన్‌ అయ్యారు. మాసీవ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మేకర్స్‌ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ షెడ్యూల్‌ కోసం ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఆనంద్‌ సాయి అండ్‌ టీమ్‌ మాసీవ్‌ సెట్‌ని రూపొందించారు. మాస్‌ పల్స్‌ తెలిసిన దర్శకుడు హరీష్‌ శంకర్‌ మరోసారి మాస్‌ను మెప్పించే సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని మాస్‌ అవతార్‌లో టెర్రిఫిక్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రెజెంట్‌ చేస్తున్నారు. ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పవన్‌ సరసన శ్రీలీల నటిస్తోంది. అశుతోష్‌ రానా, నవాబ్‌ షా, కేజీఎఫ్‌ ఫేమ్‌ అవినాష్‌, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్‌, టెంపర్‌ వంశీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన -దర్శకత్వం : హరీష్‌ శంకర్‌.ఎస్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవి శంకర్‌, స్క్రీన్‌ ప్లే: కె దశరథ్‌, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌, డీవోపీ: అయనంక బోస్‌, ఎడిటర్‌: చోటా కె ప్రసాద్‌, అడిషినల్‌ రైటర్‌: సి. చంద్రమోహన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఆనంద్‌ సాయి, ఫైట్స్‌: రామ్‌ – లక్ష్మణ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: చంద్రశేఖర్‌ రావిపాటి, హరీష్‌.

Spread the love