వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు

నవతెంలగాణ – పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను విజయవాడలోని టాప్‌స్టార్‌ ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు నిర్ధరించారు. యాంజియోగ్రామ్‌ చేసి స్టంట్‌ వేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని టాప్‌స్టార్‌ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.

Spread the love