- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : వేసవి కాలం దృష్ట్యా ఎండలో ఎంతో ఇబ్బంది పడుతున్న గ్రామ ఉపాధి హామీ కూలీలు పనిచేసే సమయంలో టోపీలు దరిస్తే ఎండ ప్రభావం నుండి కొంత తట్టుకోగలరని గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ సూచించారు. అందుకు గాను వారి స్వంత ఖర్చులతో దాదాపు 100 మంది ఉపాధి కూలీలకు టోపీలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దినకర్, పి ఆర్ఏఈ శ్యామ్ సుందర్ రెడ్డి, సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



