పసర పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడలు

– ఎస్ ఐ సి హెచ్ కరుణాకర్ రావు
నవతెలంగాణ – గోవిందరావుపేట
పసర పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుండి వచ్చిన టీమ్ లకు ఆదివారం మండల కేంద్రంలో వాలీబాల్ క్రీడలు ప్రారంభించినట్లు ఎస్సై సిహెచ్ కరుణాకర్ రావు తెలిపారు. క్రీడల ప్రారంభం సందర్భంగా ఎస్ ఐ సి హెచ్ కరుణాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని 18 పంచాయతీలకు గాను 13 పంచాయతీల నుండి వాలీబాల్ జట్లు ఆడేందుకు వచ్చినట్లు తెలిపారు. క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించవచ్చని క్రీడాకారులకు భోజన సదుపాయం కల్పించినట్లు తెలిపారు. సెమీఫైనల్ ఫైనల్ పోటీలు ఈనెల 20 న పోలీస్ స్టేషన్ గ్రౌండ్ లోనే నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి సర్పంచ్ లు లావుడియా లక్ష్మి, సనప సమ్మయ్య, వాసం కన్నయ్య,ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పి ఈ టి లు యాలం ఆదినారాయణ దనసరి శ్రీనివాస్ ఈక మహేందర్ తదితరులు పాల్గొన్నారు

Spread the love