దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనం వృధా

– ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు బాలు యాదవ్
నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు కర్రేవార్ బాలు యాదవ్ మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో ఏ ఒక్క కుటుంబం బాగుపడలేదని కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగు పడిందని ఆరోపించారు దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాదనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. అధికార బిఆర్ఎస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి హన్మంత్ షిండే ఇక్కడ స్థానికంగా ప్రజల సమస్యలు ఒక్కటి కూడా పట్టించుకోకుండా ఎమ్మెల్యే మాత్రం ధనవంతుడు అయ్యాడని భూములు సంపాదించుకున్నాడ నీ పేద ప్రజల సమస్యలు మాత్రం ఏమాత్రం పట్టించుకోని ఈ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట సంక్షేమం పేరుతో పార్టీ ప్రచారాలు జరుపుకుంటుందని ప్రభుత్వపరంగా నిర్వహించే దశాబ్ద ఉత్సవాల్లో పార్టీ నాయకులు గాని ఎమ్మెల్యే గాని రాబోయే ఎన్నికల్లో మరొక్కసారి కేసీఆర్ కు అవకాశం ఇవ్వాలని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు ఒక నాయకునిగా నేను ఇక్కడి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకటి అడగదలుచుకున్న మీరు ప్రజలకు ఏమి చేశారు అని దశబ్ద ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మండలంలో గ్రామ పంచాయతీ ముందర రహదారి చూస్తే ఆ రోడ్డు సరిగ్గా లేక ప్రజలు ప్రయాణికులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని అభివృద్ధి మాత్రం శూన్యం దశాబ్ది ఉత్సవాలు మాత్రం ఘనం అనే చందంగా అధికార పార్టీ ప్రజాధనాన్ని వృధా చేస్తుందని దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలకు ఏమిస్తుందని ప్రశ్నించారు జుక్కల్ నియోజకవర్గం లో వేల సంఖ్యలు అర్హులైన నిరుపేదలు ఇండ్లు లేక ఇండ్ల స్థలాలు లేక కొట్టుమిట్ట లాడుతుంటే ఏ ఒక్కరికి ఇండ్లు మంజూరు చేయడం లేదని దశాబ్ది ఉత్సవాల్లో ఎన్నికల ప్రచారాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఆరోపించారు దళితులకు దళిత బందు లేదు మూడు ఎకరాల భూము లేదు మళ్లీ కొత్త సాకుతో బీసీ కులాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అంటూ ఎక్కడో ఒకరిద్దరికీ పంపిణీ చేస్తూ ప్రజలకు మభ్యపెట్టే మాటలతో మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు వేసుకునే ప్రయత్నం ప్రజలకు మోసగించడమేనని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా బర్రె గొర్రె అంటూ పథకాల పేరుతో ఉద్యోగాల భర్తీ కాలయాపన చేస్తుందని తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబాల్లో ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటివరకు ఆ కుటుంబాలను గుర్తించిన దాఖలా లేవని ఎదువ చేశారు జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణం బి ఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ప్రజలంతా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పనితీరుపై గమనిస్తున్నారని తెలిపారు రాబోయే రోజుల్లో ప్రజలే కెసిఆర్ పార్టీకి బుద్ధి చెప్తారని కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను ప్రజలు తిప్పి కొట్టే రోజులు దగ్గరపడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కర్రేవార్ మరోతి, మరోతి కొలవార్ ,పాండు మాదిగ కర్రేవార్, పాండురంగ మాదిగ, ద్యపుర్వర్ సురేష్ మాదిగ గడ్డంవార్, అర్జున్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Spread the love