– ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయాలకతీ తంగా ప్రజల సహాయ సహకారాలతో అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలో ”ప్రగతి యాత్ర”లో భాగంగా 77 వ రోజుకార్పొరేటర్ బి.విజరు శేఖర్ గౌడ్‌తో కలిసి పట్వారి ఎంక్లేవ్ లో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు, పార్క్‌ను పరిశీలించారు. ముందుగా రూ.35 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాగా భూగర్భ డ్రయినేజీ అభివృద్ధి చేసినందుకు, సీసీ రోడ్డు ఏర్పాటుకు సహకారం అందిస్తున్నందుకు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. పార్క్ అభివృద్ధికి కృషి చేయాలని కోరగా.. అక్కడే ఉన్న అధికారులకు సత్వరమే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ కె. జయరామ్, పట్వారి ఎంక్లేవ్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మద్దునూరి వెంకటేష్, బీఆర్‌ఎస్ స్థానిక డివిజన్ ప్రధాన కార్యదర్శి జి. సుధాకర్, స్థానిక సంక్షేమ సంఘం నాయకులు, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వివేకానంద్, కార్పొరేటర్ బి. విజయ శేఖర్ గౌడ్ లను కాలనీవాసులు సన్మానించారు.