Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమస్యల్లేని విలీనం,
ఉద్యోగ భద్రత కావాలి

సమస్యల్లేని విలీనం,
ఉద్యోగ భద్రత కావాలి

- Advertisement -


ఐక్యపోరాటాలతోనే హక్కులు సాధించగలం
ఆత్మ గౌరవంతో ఉద్యోగం చేసే పరిస్థితి ఉండాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు
నవతెలంగాణ – మహబూబ్‌ నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

సమస్యలు లేని విలీనం, సంపూర్ణ ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ను బలపరచాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు అన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనమయ్యే ప్రక్రియ ఏలాంటి సమస్యలు లేకుండా జరగాలన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు డిపోల ఆర్టీసీ కార్మికుల గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి హజరైన వీరాంజనేయులు మాట్లాడుతూ ఆర్టీసీలో విలీన ప్రక్రియ త్వరగా జరగాలని కార్మికులందరూ కోరుకుంటున్నారని, అయితే సమస్యలను ముందుగానే పరిష్కరించాలని విలీన కమిటీ, ప్రభుత్వంతో చర్చించిన సంఘం ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మాత్రమేనని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ఐక్య పోరాటం మూలంగా 11శాతం వేతన సవరణ, జరగబోయే విలీనం ప్రక్రియలో కార్మిక సంఘాల భాగస్వామ్యం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఆర్టీసీ కార్మిక వర్గానికి లాభం చేకూరాలంటే సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పని భారం, వేధింపులు లేకుండా ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసుకునే పరిస్థితులు కల్పించబడాలన్నారు. ఈ సమావేశంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్, రీజనల్ కార్యదర్శి ఎస్ వెంకటయ్య, డిపో అధ్యక్ష కార్యదర్శులు నంది, వెంకటేష్, రీజినల్ నాయకులు బాష, అర్జున్, వర్ధనమ్మ, చింతలయ, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -