అండగా ఉంటాం.. ఆందోళన వద్దు.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

నవతెలంగాణ- డిచ్ పల్లి
మెమందరం అండగా ఉంటాం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స చేయించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్అన్నారు.శనివారం ఇందల్ వాయి మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు మెత్కురి నవీన్ గౌడ్ అమ్మ అనారోగ్యం పాలు కావడంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నవీన్ గౌడ్ ను మనోధైర్యాన్ని కల్పించారు. ఎళ్లవేళలా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఆయనతోపాటు పీసీసీ ఉపాధ్యక్షుడు తాహేర్ బిన్ హందాన్ ఉన్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్ ఖేత్ మండల అధ్యక్షుడు ఎల్ ఐ సి గంగాధర్, డిసిసి డెలిగేట్ వెంకటరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, మల్లేష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, లారీ గంగారెడ్డి, దండ్ల రాజన్న, వసంతరావు, నారాయణ, సాయందర్, శంశుద్దీన్ ,మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love