గిరిజన సంప్రదాయంలో ప్రకృతి అందాల నడుమ వివాహ మహౌత్సవం

– హాజరైన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-పినపాక
స్వచ్ఛమైన, దట్టమైన అడవులు. గంభీరమైన కొండలు, పక్షుల కిలకిలారావాలు. పచ్చని ప్రకృతి అందాలు వీటి మధ్య గిరిజనుల సంస్కృతులకు గుర్తుగా సజీవ సాక్ష్యంగా అమా యక ఆదివాసీ జనం, అడవితల్లి బిడ్డలుగా ప్రకృతి ఒడే ఆవాసంగా నివసించే ఆదివాసీలకు తొలిసారిగా పినపాక మండలంలో ఆదివాసీ సంప్రదాయంలో వివాహం నిర్వహించారు. పినపాక మండలం వలస ఆదివాసి గ్రామం చింతలపాడులో కిషోర్‌, రాఖీ వివాహం పూర్తి ఆదివాసి సాంప్రదాయంలో తొలిసారిగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య హాజరయ్యారు. గిరిజన నృత్యాలు, కొమ్ము డాన్సులు, థీంస నృత్యాలు ఆలరించాయి. ప్రకృతి అందాల నడుమ వివాహాన్ని అంగరంగ వైభవంగా వేదమంత్రాలు, అయ్యవారు లేకుండానే గిరిజన సంప్రదాయంలో నిర్వహించారు. ఈ వివాహాన్ని చూడటానికి రెండు జిల్లాల నుండి జనాలు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మడివి రమేష్‌, సీపీఐ(ఎం) మండల కన్వీనర్‌ నిమ్మల వెంకన్న, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు దుబ్బా గోవర్ధన్‌, మహిళ నాయకురాలు ఈసం భవతి, మడివి గంగమ్మ, జోగయ్య, సీపీఐ(ఎం) నుంచి అధిక సంఖ్యలో నాయకులు, పినపాక సర్పంచ్‌ నాగేశ్వరరావు, ఎంపీటీసీ సత్యం, పినపాక నవతెలంగాణ రిపోర్టర్‌ శ్రీరాం బృహస్పతి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love