మామిడిపల్లి చౌరస్తా వద్ద మంగళ హారతులతోఎమ్మెల్యేకు స్వాగతం

నవతెలంగాణ – ఆర్మూర్ 

పియుసి చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే  ఆశన్నగారి జీవన్ రెడ్డి మూడవ సారి  నియోజకవర్గం నుంచి విజయదుందుభి మోగించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు తీసుకుని మొదటి సారి పట్టణానికి వచ్చిన జీవన్ రెడ్డి కి శుక్రవారం మున్సిపల్ కౌన్సిలర్, న్యాయవాది సంగీతా ఖాందేష్ ఆధ్వర్యములో మహిళా మణులు పెద్ద ఎత్తున మామిడిపల్లి చౌరస్తా వద్ద మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భములో సంగీతా ఖాందేష్ మంగళ హారతి ఇచ్చి నుదుటిన తిలకం దిద్ది ఆర్మూర్ ఖత్రి పట్టు వస్త్రముతో తయారు చేసిన తలపాగా పెట్టినారు. వెంటనే కాంప్లెక్స్ పైనుంచి యువజన సభ్యులు పూల వర్షం కురిపించారు. ఈ సందర్బంగా మహిళలందరూ సంతోషంతో నినాదాలు చేస్తూ కాబోయే మంత్రి నాయకత్వం వర్ధిల్లాలి అని అన్నారు.
Spread the love