మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రేవంత్‌రెడ్డి సర్కారు నడుపుతున్నారో సర్కస్ నడుపుతున్నారో అర్థం కావడం లేదని మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం చేసే ప్రతి దాంట్లో అవినీతి జరుగుతోందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ భూభారతిలో దొంగలెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలా?, అధికారులా?, అదృశ్య శక్తులు ఎవరైనా ఉన్నారా చెప్పాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డికి పరిపాలనపై అవగాహన లేదన్నారు. రియల్ ఎస్టేట్ దందా తప్ప ఆయనకు ఏమీ తెలియని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 4,500 దరఖాస్తులు ఎవరికీ సంబంధం లేకుండా భూభారతిలో ఆమోదం పొందాయని వివరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని మంత్రి పొంగులేటి బీజేపీవైపు చూస్తున్నారని అన్నారు. హైడ్రాతో సెటిల్‌మెంట్లు తప్ప ఏమీ జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు పల్లా ప్రవీణ్, ధర్మేందర్, పడాల సతీశ్, కడారి స్వామి యాదవ్, కృష్ణ, మిథున్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
భూభారతిలో దొంగలెవరో చెప్పాలి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



