ఎవరి వైపు మన ఓటు

  • ఎ.అజయ్ కుమార్

దేశంలో 18వ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు దేశానికి చాలా ప్రధానమైనవి. దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు. ఈ క్రమంలో ప్రతి ఓటరు ముందు రెండు ప్రశ్నలు కదలాడుతున్నాయి. ఒకటి ఎవరికి ఓటు వేయాలి.. రెండు ఎందుకు ఓటు వేయాలి. ఈ రెండు ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉంటే మన ఓటుకు సార్థకత లభిస్తుంది. ఈ దేశంలో ఓటు హక్కు కల్గిన ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఎవరికి వారు తమ సొంతంగా ఓటు వేసే హక్కు ఉంది. రాజకీయ పార్టీల ప్రలోభాలకు, కుల సంఘాల నాయకులు చెప్పారు. కులం, మతం, మన వాడు అంటూ ఇలాంటి ప్రలోభాలకు లొంగి ఓటు వేయాల్సిన అవసరం ఏమి ఉందనే విషయాన్ని ఆలోచించాలి.
ప్రస్తుతం దేశంలో రెండు ప్రధాన కూటమిల మధ్య పోరు జరుగుతోంది. ఒకటి ఎన్‌డీఏ కూటమి, మరొకటి ఇండియా బ్లాక్‌. గత పదేండ్లుగా ఎన్‌డీఏ కూటమి అధికారంలో ఉంది. ఈ సారి కూడా గెలిచి ప్రధానిగా మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేయాలనీ భావిస్తున్నాడు. ఇండియా బ్లాక్‌ కూడా అధికారంలోకి రావడానికి కృషి చేస్తోంది. అయితే దేశానీకి ఎవరు ఉ పయోగపడుతారు.. ఎవరితో దేశం బాగు పడుతుంది. ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఈ దేశానీకి ఎవరి నాయకత్వం అవసరం అనే ఆంశాలను బేరీజు చేసుకొని మనం ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలి. అలాగే ఇన్నాళ్లు అధికారంలో ఉన్న వారి పాలన ఏ విధంగా ఉంది. దేశ ప్రజల కోసం వారు చేసిన పనులు ఏంటీ.. ఎవరి ప్రయోజనాల కోసం పని చేశారో కూడా ఆలోచించాలి.
పదేండ్లలో దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. ప్రధానిగా మోడీ వ్యవహరించారు. వీరి పాలన గురించి విశ్లేషించాల్సిన అవసరం తప్పకఁండా ఉంది. 2014 ఎన్నికల్లో గుజరాత్‌ మోడల్‌ అంటూ గ్లోబల్‌ ప్రచారంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అనంతరం జరిగిన 2019 ఎన్నికల్లో దేశభక్తి ని అడ్డు పెట్టుకుని మళ్లీ విజయం సాధించింది. ఈ పదేండ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ సారి ఎన్నికల్లో కూడా బీజేపీకి చేసింది చెప్పడానీకి ఏమీ లేదు. దాంతో ఇప్పుడు అయోధ్య రామ మందిరాన్ని తెరమీదికి తెచ్చింది. రిజర్వేషన్ల రద్దు అంటూ కొత్త రాగం ఎత్తుకుంది. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం చేపట్టిన నాటి నుంచి ఏ చేసిందో చెప్పి మరుసటి ఎన్నికల్లో ఓటు అడగాలి కానీ బీజేపీ మాత్రం మత విద్వేషాలు, ప్రజల మనోభావాలతో ఓట్లు ఆడుగుతోంది.
అయితే ప్రజల్లో కొత్త ఆలోచన మొదలైంది. బీజేపీకి ఎందుకు ఓటేయాలనే ప్రశ్న ఓటర్లలో ఉత్పన్నం అవుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ పదేండ్లలో బీజేపీ అవలంభించిన విధానాలే కారణం. ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే దేశంలో పేదరికం, నిరుద్యోగం నిర్మూళనకు కృషి చేయాలి. ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు కల్పించాలి. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ప్రణాళికలు రూపొందించాలి. కానీ ఇవేవీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం చేయలేదు.
ఇక ఈ పదేండ్లలో మోడీ తీసుకున్న ని ర్ణయాలపై కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.. ప్రధాని హోదాలో మోడీ కొన్ని కీలక ని ర్ణయాలు తీసుకున్నారు. దేశ రూపురేఖలే మారుతాయని చెప్పారు. కానీ ఆ నిర్ణయాలు ఏవీ దేశ ప్రజలకు ఉ పయోగకరంగా లేవు. ముఖ్యంగా 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడిరది. కేవలం 50 రోజులు సమయం ఇవ్వండి. దేశంలో అవినీతి అంతం చేస్తా అని ప్రకటించారు. కానీ అవినీతి అంతం కాకపోగా ఈ నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాత నోట్లు మార్చుకోవడానికి బ్యాంక్‌ల వద్ద బారులు తీరారు. వృద్ధులు ఎంతో మంది తమ ప్రాణాలను పొగొట్టుకున్నారు. మోడీ తీసుకఁన్న మరో నిర్ణయం జీఎస్టీ. దీనితో ప్రజలపై భారాలు మోపారు. విపరీతంగా ధరలు పెంచి, ప్రజల నడ్డి విరిచారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వచ్చినప్పుడు కూడా మోడీ విధానాలు ప్రజలను విస్మయానికి గురిచేశాయి. డబ్ల్యూహెచ్‌ఓ ముందుగానే హెచ్చరించినా మోడీ ప్రభుత్వం కరోనా కట్టడికి ఎలాంటి చొరవ చూపలేదు. దాంతో దేశవ్యాప్తంగా కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. శ్మశనాలు శవాల గుట్టలను తలపించాయి. గంగ నదిలో శవాలు తేలాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇంత దయనీయ స్థితిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించలేకపోయాడు ప్రధాని. ఇదిలా ఉంటే దీపాలు వెలిగించండి.. చప్పట్లు కొట్టండి.. అంటూ ప్రజలను మూఢత్వంలోకి నెట్టాడు. ఇక ఈ పదేండ్లలో మోడీ కేవలం కార్పొరేట్లకు తొత్తుగా వ్యవహరించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదానీ, అంబానీలను ప్రపంచ కుభేరులుగా చేయడంలో మోడీ పాత్ర కీలకం.
మూడు నల్ల చట్టాలు దేశ రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. తమ హక్కుల కోసం ఏడాది పాటు రైతులు ఢిల్లీ నడిఒడ్డున పోరాటం చేశారు. ఈ పోరాటంలో సుమారు 750 మంది రైతులు తమ ప్రాణాలను విడిచారు. రైతుల విషయంలో మోడీ ప్రభుత్వం అవలంభించిన తీరు చాలా పాశావికం. అలాగే 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి కార్మికులను కాలరాసింది బీజేపీ ప్రభుత్వం. తమ హయంలో అవినీతికే అస్కారం లేదు అనీ చెప్పిన మోడీ ఎలక్ట్రోలర్‌ బాండ్స్‌ తీసుకొని అధికారిక అవినీతికి పాల్పడింది . ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చా దళిత, మైనార్టీలపై దాడులు పెరిగాయి. గో రక్షణ పేరుతో దళితులు, మైనార్టీలకు కొట్టి చంపిన ఉదంతాలు ఉన్నాయ్.. వీటిపై ప్రశ్నించిన జర్నలిస్టులను హత్య చేసిన ఘటనలు ఉన్నాయి. ఇందుకు సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యనే ఊదాహరణ. అలాగే అనేక మంది ప్రజాస్వామికవాదుల మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేసింది మోడీ ప్రభుత్వం. ఫ్రొఫెసర్‌ సాయిబా కేసే ఇందుకు మంచి ఊదాహరణ. మహిళలపై కూడా దాడులు విపరీతంగా పెరిగాయి. ఉన్నవ్, హత్రస్‌ ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. యూపీలో ఇలాంటి ఘటనలు కొకొల్లాలు. ఇటీవల మణిపూర్‌లో చేలరేగిన హింస దేశాఁకే మచ్చ. అక్కడ అల్లర్లను బీజేపీ ప్రభుత్వం అదుపు చేయలేకపోయింది. మణిపూర్‌ మంటల్లో తగలబడుతుంటే ప్రధాని మౌనంగా ఉండిపోయారు. కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అక్కడ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని కలిచివేసింది. బీజేపీకి మహిళల పట్ల ఉన్న గౌరవం ఏ పాటితో తేలియాలి అంటే బిల్కిస్‌బానో కేసులో నిందితులకు బీజేపీ నాయకులు స్వాగతం పలికిన ఘటన ఒక్కటి చాలు. ఇక మోడీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏమీ అమలు చేయలేదు.
సత్‌ కా సత్‌ సబ్‌ కా వికాస్‌, మెక్‌ ఇన్‌ ఇండియా, భేటి బాఛావో.. భేటి పడావో.. స్వచ్ఛ భారత్‌.. తదితర కార్యక్రమాలు అన్నీ నినాదాలు గానే మిగిలాయి. ఈ పదేండ్లలో దేశం ఈ విషయంలో ప్రగతినీ సాధించింది అని చెప్పడానికి ఏ ఒక్కటి లేదు. పదేండ్ల మోడీ పాలనను ఒకసారి గుర్తు చేసుకుంటే సామాన్యుడికి చేసిందేమీ లేదు. మోడీ తన నియంత నిర్ణయాలతో సామాన్యుడినీ ఇబ్బందులకు గురిచేశాడే తప్పా సామాన్యుడి జీవితాన్ని మార్చింది లేదు. వీటన్నీంటినీ ఒకసారి సామాన్య ఓటరు ఈ ఎన్నికల సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదేండ్ల మోడీ పాలనపై సమగ్రంగా ఆలోచించి సామాన్యుడు ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోవాలి. దేశం అభ్యున్నతి.. దేశ ప్రగతినీ కాంక్షించే ప్రజలు, ముఖ్యంగా యువత లోతుగా ఆలోచించి ఈ పదేండ్లు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించిన మోడీకి ఓటుతోనే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

Spread the love