ప్లాస్టిక్‌ను నివారించాలి… పర్యావరణాన్ని కాపాడాలి

ప్లాస్టిక్‌ను నివారించాలి... పర్యావరణాన్ని కాపాడాలిభూమి నీలిరంగులో కనిపించే మానవ నివాసయోగ్యమైన ఒక గ్రహం. నాలుగింట, మూడొంతుల భూమి నీటితో ఆవరించబడి ఉండటం వలన భూమి నీలి రంగులో కనిపిస్తుంది. ఎర్త్‌ డే మొదటిసారిగా ఏప్రిల్‌ 22, 1970న పాటించబడింది. ఇది ఆధునిక పర్యావరణ ఉద్యమానికి నాందిగా పరిగణించబడుతుంది. 1969లో శాంటా బార్బరా తీరంలో చమురు చిందటం వలన కలిగిన అపారమైన పర్యావరణ విధ్వంసానికి ప్రతిస్పందనగా, అమెరికా సెనేటర్‌ గేలార్డ్‌ నెల్సన్‌ పర్యా వరణాన్ని ఎలా రక్షించాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎర్త్‌ డేని స్థాపించారు. ఐక్యరాజ్యసమితి 2009 సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 22న జరుపుకునే ధరిత్రి దినోత్సవాన్ని ” ఇంటర్నేషనల్‌ మదర్‌ ఎర్త్‌ డే” గా నామకరణం చేసింది.
ప్రతి సంవత్సరం ధరిత్రి దినోత్సవాన్ని”ఎర్త్‌ డే. ఓ ఆర్‌ ర్జీ” (జుA=ునణA్‌.ఉ=+) అనే సంస్థ నిర్వహిస్తుంది. ఇది స్థిరమైన జీవనం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి పనిచేసే ప్రపంచ సంస్థ.”ఎర్త్‌ డే.ఓఆర్‌ జి” లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ ఉద్యమాన్ని వైవిధ్య పరచడం, అవగాహన కల్పించడం. మొదటి ఎర్త్‌ డే (1970) నుండి అభివృద్ధి చెందుతూ, పర్యావరణ ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి దాదాపు 192 దేశాలలో 150,000 కంటే ఎక్కువ భాగస్వాములతో కలిసి ఈ సంస్థ పని చేస్తుంది.ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక బిలియన్‌ కంటే ఎక్కువ మంది ప్రజలు ఎర్త్‌ డే కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఏప్రిల్‌ 22ని ఎర్త్‌ డేగా ఎంచుకున్నారనడానికి ఓ కారణం ఉంది. 1970లో మొదటి ఎర్త్‌ డే ప్రారంభమైనప్పుడు నిర్వాహకులు కళాశాల క్యాంపస్లలో విద్యార్థులు గరిష్టంగా పాల్గొనే తేదీని కోరుకున్నారు. ఏప్రిల్‌ 22 స్ప్రింగ్‌ బ్రేక్‌, ఇది విద్యార్థులకు ఈవెంట్లు, ర్యాలీలను నిర్వహించడానికి అనుకూలమైన సమయం. అదనంగా, ఈ తేదీన ఏ మతపరమైన సెలవులు లేదా ఇతర ప్రధాన కార్యక్రమాలు లేవు. అందుకు ఈ రోజును అనువైనదిగా భావించారు.
ఎర్త్‌ డే 2024 థీమ్‌
ఎర్త్‌ డే 2024 థీమ్‌ (విషయము) ప్లానెట్‌ వర్సెస్‌ ప్లాస్టిక్స్‌. ఈ థీమ్‌ ముఖ్య ఉద్దేశం. 2040 కల్లా 60 శాతం ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం, భూమిని ప్లాస్టిక్‌ రహితముగా మార్చడం. ఇది మనల్ని, పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సమస్య అయిన ప్లాస్టిక్‌తో పోరాడటమే ప్లాస్టిక్‌ నివారణకు సరైన మార్గం.ప్లాస్టిక్‌లు విచ్ఛిన్నమైన తర్వాత కూడా, అవి మైక్రోప్లాస్టిక్లుగా భూమిలో మిగిలిపోతాయి. ప్లాస్టిక్లు మైక్రోప్లాస్టిక్లుగా విడిపోవడంతో విషపూరిత రసాయనాలు మన ఆహారం ద్వారా, నీటి వనరుల ద్వారా, మనం పీల్చే గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి రక్త ప్రవాహం ద్వారా మైక్రోప్లాస్టిక్స్‌, పేరు సూచించినట్లుగా, చిన్న ప్లాస్టిక్‌ కణాలు. అధికారికంగా అవి ఐదు మిల్లీమీటర్ల (0.2 అంగుళాలు) కంటే తక్కువ వ్యాసం కలిగిన ప్లాస్టిక్లుగా నిర్వచించబడ్డాయి. దాదాపు 70శాతం దుస్తులు ముడి చమురుతో తయారవుతాయి, దీని ఫలితంగా ఉతికినప్పుడు ప్రమాదకరమైన మైక్రోఫైబర్లు విడుదలై పల్లపు ప్రదేశాలలో దీర్ఘకాలిక కాలుష్యాన్ని కలగజేస్తాయి. అదేవిధముగా దాదాపు 85శాతం వాడిన వస్త్రాలు ల్యాండ్ఫిల్ల లోనికి పారవేయపడి నేల కాలుష్యాన్ని కలగజేస్తాయి. కేవలం ఒక శాతం మాత్రమే రీసైకిల్‌ చేయబడతాయి.
నాన్‌ స్టిక్‌ పాన్‌ దోశలతో క్యాన్సర్‌
నాన్‌ స్టిక్‌ పాన్‌ల ఉపరితలం ”పాలి టెట్రా ఫ్లోరో ఇథలీన్‌” అనే పాలిమర్‌తో పూత వేస్తారు. దీనినే ”టెఫ్లాన్‌” గా వ్యవహరిస్తారు. ఇది ప్లాస్టిక్‌ల వలె కృత్రిమంగా తయారు చేయబడే ఒక పాలిమర్‌. ఇది ఒక క్యాన్సర్‌ కారకం. దోశలు మొదలైన ఆహార పదార్థాలు నాన్‌ స్టిక్‌ పాన్‌లో వండించటం వలన క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉన్నది. నాన్‌స్టిక్‌ పాన్‌ వేడి చేయడం వల్ల టెఫ్లాన్‌ కరిగి ఆహారంలో కలుస్తుంది. దాని వల్ల మనిషి శరీరంలోకి వెళ్తుంది. అదే ఇనుప పెనం మీద అయితే ఎటువంటి కెమికల్స్‌ ఉండవు. గనుక ఇనుప పెనం మీద చేసిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
సిగరెట్లతో ప్లాస్టిక్‌ కాలుష్యం
ప్లాస్టిక్స్‌ సీసాలు, స్ట్రాస్‌, ప్లాస్టిక్‌ సంచులు కన్నా సిగరెట్‌ పీకలు వాస్తవానికి ప్రపంచంలో అత్యధిక సమృద్ధిగా ఏర్పడే ప్లాస్టిక్‌ వ్యర్ధాలు. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం చేసేవారు ప్రతి సంవత్సరం దాదాపు 6.5 ట్రిలియన్‌ సిగరెట్లను కొనుగోలు చేస్తున్నారు. ”సెల్యులోజ్‌ అసిటేట్‌” అనే మానవ నిర్మిత ప్లాస్టిక్‌ పదార్థంతో తయారు చేయబడతాయి, వందలాది విష రసాయనాలను కలిగి ఉంటాయి. సిగరెట్‌ ఫిల్టర్లు, లేదా బట్స్లోని ప్లాస్టిక్‌ భాగం . సముద్ర జీవులపై సిగరెట్‌ పీకల ప్రభావముపై 2022 సంవత్సరంలో ఒక అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం ప్రకారం సముద్ర జంతువులు ప్లాస్టిక్‌ల వలన ఊపిరి ఆడక తీవ్రమైన అనారోగ్యానికి గురై మరణిస్తున్నాయని ఈ అధ్యయనం తెలియజేసింది. ఇదే పరిశోధన సిగరెట్‌ పీకల నుంచి విడుదలైన మైక్రోప్లాస్టిక్లు మానవ కణజాలాలలో ఎలా వచ్చి చేరుతున్నవో వివరించింది.
తూర్పు వైపుకు వంగిన భూమి అక్షం
భూమిపై నీటి అసమాన పంపిణీ వలన భూఅక్షము ప్రతి సంవత్సరము 1.7 ఇంచులు తూర్పు వైపుకు వంగిపోతున్నది. భూగర్భజలాలను వెలికితీసి మరో చోటుకు తరలిస్తుండడం వల్ల భూమి అక్షం తూర్పు వైపు 80 సెం.మీ వంగిపోయింది. ఈ మార్పు1993-2010 మధ్య కాలంలో జరిగింది. భూగర్భ జలాలను వెలికి తీయడం, నీటిని భారీగా సముద్రాల్లోకి తరలించడమే ఇందుకు కారణమని కొత్త అధ్యయనం తెలిపింది.”బయటకు తీసిన భూగర్భజలాలు ఆవిరిగా మారి వాతావరణంలో చేరతాయి లేదా నదుల్లో కలుస్తాయి. తర్వాత వానల రూపంలో సముద్రంలో కలుస్తాయి. ఈ విధంగా నీరు భూభాగం నుంచి సముద్రాలకు చేరుతుంది.
1993-2010 మధ్య కాలంలో మానవులు 2,150 గిగాటన్నులు భూగర్భజలాలను వెలికితీశారని అధ్యయనాలు అంచనా వేశాయి. 2,150 గిగా టన్నుల నీరు 860 మిలియన్‌ ఒలంపిక్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ను నింపగలవు. 2,150 గిగా టన్నుల నీటి పరిమాణం అంటే 6 మి.మీకు పైగా సముద్ర మట్టాల పెరుగుదలకు సమానం.నీరు కదులుతున్నప్పుడు భూమి కూడా కాస్త భిన్నంగా తిరుగుతుంది.సముద్ర మట్టం పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీరప్రాంత జీవనానికి తీవ్ర ముప్పు ఏర్పడు తోంది. తుఫాను ఉప్పెనల తీవ్రత, వరదలు, తీర ప్రాంతాలకు నష్టం వాటిల్లడం వంటివి సంభవిస్తాయి.
(ఏప్రిల్‌ 22 ” ఇంటర్నేషనల్‌ మదర్‌ ఎర్త్‌ డే”)
శ్రీదరాల రాము
9441184667

Spread the love