సంసిద్ధత (డియస్సీ తెలుగు)

సంసిద్ధత (డియస్సీ తెలుగు)డియస్సీ తెలుగు – 2023కి సన్నద్ధమౌతున్న అభ్యుర్ధులకు శుభాభినందనలు. స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌ పరీక్షలకు కంటెంట్‌కి ఒకే సిలబస్‌ ఉన్నది. కావున ముందుగా సిలబస్‌ను ప్రింట్‌ తీసుకుని, దగ్గర పెట్టుకొని, గత ప్రశ్నా పత్రాలను పరిశీలించాలి. ముందు మీకు సిలబస్‌పైన ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే పోటీ పరీక్షలలో ఎప్పుడూ సిలబస్‌ను దాటి చదవకూడదు. గత ప్రశ్నాపత్రాలను పరిశీలించడం చాలా ముఖ్యమని గ్రహించండి. కేవలం భాషాపండిట్‌ (ూూ- ువశ్రీబస్త్రబ) కి మాత్రమే సన్నద్ధం కాదల్చుకుంటే కంటెంట్‌ తెలుగు కొరకు పదోతరగతి వరకు తెలంగాణ రాష్ట్ర పాఠ్యగ్రంథాలపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలి. అలాగే పదో తరగతి వరకు ఉన్న పాఠ్య గ్రంథాలలోని పాఠ్యాంశాలు, కవులు/రచయితలు, వారికి సంబంధించిన బిరుదులు, విశేషాలు, మూల గ్రంథాలపై అవగాహన కచ్చితంగా ఉండాలి. అదే విధంగా స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగుకి మాత్రమే సన్నద్ధమయ్యేవారు ఇంటర్మీడియట్‌ వరకు పాఠ్యాంశాల విశేషాలపై దృష్టి సారించాలి.
పక్కా ప్రణాళికతో…
లాంగ్వేజ్‌ పండిట్‌ తెలుగు, స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగుకి ఒకే సిలబస్‌ కావున కంటెంట్‌ 88 ప్రశ్నలు డియస్సీలో అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 1/2 మార్కు కావున 44 మార్కులు కంటెంట్‌కి ఇవ్వడం జరిగింది. కాబట్టి డియస్సీ తెలుగులో విజయం సాధించాలంటే 44 మార్కులపైన పట్టు సాధించాలి. అతి సులభంగా కంటెంట్‌ను పక్కా ప్రణాళికతో సిలబస్‌ను ముందు పెట్టుకొని సన్నద్ధమైతే మీరు తప్పక విజయం సాధించగలుగుతారు. డియస్సీ తెలుగులో ఉండే మొత్తం 80 మార్కులలో 44 మార్కులు ఈ కంటెంట్‌కే ఉంటాయి. కావున ముందు మీ ప్రళాళికలో కంటెంట్‌ పూర్తి చేయడం పెట్టుకుంటే మంచి మార్కులతో పాటు ఆత్మ విశ్వాసంతో డియస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు.
గత డియస్సీలో ప్రశ్నలు అడిగిన తీరు
డియస్సీ స్కూల్‌ అసిస్టెంట్‌-2028లో నిర్దేశిత పాఠ్యప్రణాళికను అనుసరించి ప్రశ్నలు వచ్చిన విధానం చూస్తే కాస్త విశ్లేషణాత్మక, కఠినాత్మక ప్రశ్నల స్థాయి ఎక్కువగా కన్పిస్తుంది. ప్రధానంగా తెలుగులో గల ప్రామాణిక గ్రంథాలలోని విషయాలపైన అభ్యుర్థుల అవగాహనను పరిక్షించడం జరిగింది. మూల గ్రంథాలు చదవాల్సి ఉందని తెలుస్తుంది.
ప్రామాణిక గ్రంథాలు
1.బాలవ్యాకరణం-చిన్నయసూరి
2.తెలుగుభాషా చరిత్ర – భద్రిరాజు కృష్ణమూర్తి
3.తెలుగు వాక్యం- చేకూరి రామారావు
4.తెలుగులో సాహిత్య విమర్శ – ఎస్‌.వి.రామారావు
5.సాహిత్య సోపానాలు – దివాకర్ల వేంకటావధాని
6. తెలుగు సాహిత్య సమీక్ష 1 11 – జీ.నాగయ్య
7. తెలుగు కవితా వికాసం – కడియాల రామ్‌మోహన్‌రారు
8. జానపదగేయ సాహిత్యం – బిరుదురాజు రామరాజు
9. తెలుగులో కవితోద్యమాలు – తెలుగు అకాడమీ
10. కావ్యాలోకం – తెలుగు అకాడమీ
11. ఆంధ్రవాజ్మయ చరిత్ర – దివాకర్ల వేంకటావధాని
12. ఆధునిక భాషా సిద్ధాంతాలు – పి.ఎస్‌.సుబ్రమణ్యం
– తెలుగు సహాయాచార్యులు, ప్రభుత్వ డిగ్రీకళాశాల, శేర్‌లింగంపల్లి.
నానాపురం నర్సింహులు
9030057994

Spread the love