తెలంగాణ రాష్ట్ర ఉనికి

Existence of Telangana State– తెలంగాణలో మండలాలు
తెలంగాణలో జిల్లాల విభజనకు పూర్వం మండలాల సగటు సంఖ్య 46 ఉండగా, విభజన తర్వాత మండలాల సగటు 19కు తగ్గింది.
తెలంగాణలో మండలాలు ఎక్కువ గల జిల్లాలు
1. నల్గొండ (31) 2. రంగారెడ్డి (27)
3. నిజామాబాద్‌ (27) 4. సంగారెడ్డి (26)
తెలంగాణలో మండలాలు తక్కువ గల జిల్లాలు
1. వరంగల్‌ అర్బన్‌ (11)
2. జోగులాంబ గద్వాల్‌ (12)
3. రాజన్న సిరిసిల్ల (13)
4. జనగామ (13)
రెవెన్యూ డివిజన్లు ఎక్కువ గల జిల్లా: రంగారెడ్డి
తెలంగాణలో రెవెన్యూ డివిజన్లు తక్కువ గల జిల్లాలు :
1. హైదరాబాద్‌ (1)
2. వరంగల్‌ అర్బన్‌ (1)
3. వనపర్తి (1)
తెలంగాణలో రెవెన్యూ గ్రామాలు ఎక్కువ గల జిల్లా :
1. రంగారెడ్డి (604)
2. సంగారెడ్డి (601)
3. నల్గొండ (565)
తెలంగాణలో రెవెన్యూ గ్రామాలు తక్కువ గల జిల్లా :
1. హైదరాబాద్‌ (67)
2. వరంగల్‌ అర్బన్‌ (124)
3. మేడ్చల్‌ మల్కాజిగిరి (163)
రాష్ట్రంలో గల గ్రామపంచాయితీలు – 8,695
అత్యధిక గ్రామ పంచాయితీలు గల జిల్లా –
1. నల్గొండ (502)
2. సంగారెడ్డి (475)
అతి తక్కువ గ్రామ పంచాయితీలు గల జిల్లా
1) మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (77)
˜రాష్ట్రంలో గ్రామ పంచాయితీలు లేని జిల్లా – హైదరాబాద్‌
నోట్‌: తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018ను అనుసరించి రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలు, గ్రామ పంచాయితీ వార్డులను రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలు, 1,13,380 వార్డులు ఉన్నాయి. నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా 844 గ్రామ పంచాయితీలు, మేడ్చల్‌ జిల్లాల్లో అత్యల్పంగా 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.
రాష్ట్ర పరిపాలన అంశాలు
రెవెన్యూ డివిజన్లు – 68
రెవెన్యూ గ్రామాలు – 10,859
రెవెన్యూ మండలాలు – 584
మండల ప్రజా పరిషత్‌లు – 438
జిల్లా ప్రజా పరిషత్‌లు – 9
గమనిక: జిల్లా ప్రజా పరిషత్‌ లేని జిల్లా హైదరాబాద్‌
ప్రజాప్రతినిధులు:
˜రాష్ట్రంలో శాసన సభ(అసెంబ్లీ) స్థానాలు : 119+ఆంగ్లో ఇండియన్‌
రాష్ట్రంలో శాసన మండలి స్థానాలు – 40
రాష్ట్రంలో గల లోక్‌సభ స్థానాలు – 17
రాష్ట్రంలో గల రాజ్యసభ స్థానాలు – 7
రాష్ట్రంలో గల జెడ్పిటిసిలు – 438
రాష్ట్రంలో గల ఎమ్‌పిటిసిలు – 6,456
రాష్ట్రంలో గల ఎమ్‌పిపిలు – 438
నోట్‌ : విభజనకు గురి కాని జిల్లా హైదరాబాద్‌ స్టేట్‌
డెవెలప్‌మెంట్‌ ఇండెక్స్‌:
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సూచిక విలువ: 0.52
రాష్ట్రంలో జిల్లా అభివృద్ధి సూచిక అధికంగా గల జిల్లా – మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (0.70)
రాష్ట్రంలో జిల్లా అభివృద్ధి సూచిక తక్కువగా గల జిల్లా – కుమురం భీం అసిఫాబాద్‌ (0.21)
తెలంగాణ తల్లి – ప్రత్యేకత
తెలంగాణ తల్లి అనే భావనను తొలిసారి ప్రజలలోకి తీసుకు వచ్చినది – దాశరథి కృష్ణమాచార్య
తెలంగాణ తల్లి భావనను ఉద్యమ ప్రతీకగా ముందుకు తీసుకువచ్చినది – కల్వకుంట్ల చంద్రశేఖర్రావు
తెలంగాణ తల్లి రూపాన్ని మొదటిసారి చిత్రించినది – బైరోజు వెంకటరమణాచారి.
తెలంగాణ తల్లి ఎడమ చేతిలో – బతుకమ్మ (ప్రత్యేకంగా తెలంగాణకే చెందిన పండుగ బతుకమ్మ)
తెలంగాణ తల్లి కుడి చేతిలో – మొక్కజొన్న కంకి (తెలంగాణ ప్రాంతం మెట్ట పంటలకు ప్రసిద్ధి)
తెలంగాణ తల్లి కిరీటంలో, వడ్డాణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్‌ వజ్రం, జాకబ్‌ వజ్రం వున్నాయి. ఇవి తెలంగాణకు చెందిన వజ్రాలు.
తెలంగాణ తల్లి కాలిమట్టెలు – ముత్తైయిదకు చిహ్నం (ఈ వెండి మట్టెలు కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రీ ఆభరణాలకు ప్రసిద్ధి)
తెలంగాణ తల్లి ధరించిన చీర – గద్వాల్‌, పోచంపల్లి
అమరవీరుల స్థూపం
హైదరాబాద్‌లోని అసెంబ్లీకి ఎదురుగా వున్న గన్‌పార్క్‌లోని తెలంగాణ అమర వీరుల స్థూపానికి 1970 ఫిబ్రవరి 23న నగర మేయర్‌ ఎస్‌. లక్ష్మీ నారాయణ మరియు మానిక్‌రావు (ఎం.ఎల్‌.ఏ) కలిసి శంఖుస్థాపన చేశారు.
గన్పార్క్‌ అమరవీరుల స్థూపానికి వస్తు సేకరణ చేసినది – ప్రతాప్‌ కిషోర్‌, విలియమ్స్‌ అంతి
ఈ స్థూపం పూర్తి అయినది – 1975
ఈ స్థూపు రూపశిల్పి – ఎక్కా యాదగిరి
స్థూపం ప్రత్యేకత
నల్లరాతి స్థూపం అడుగు భాగంలో 9 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు అమరవీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన బుల్లెట్‌ గుర్తులు.
స్థూపంలో ఎర్రరాతి నల్లరాతిపై భాగంలో ఉంటుంది. ఈ ఎర్రరాతి సాహసాన్ని తెల్పుతుంది.
ఈ ఎర్రరాతి భాగంలో మకర తోరణం ఉంటుంది. ఈ తోరణం అమరవీరులకు జోహార్లు సూచిస్తుంది.
ఎర్రరాతి పై భాగంలో మళ్ళి నల్లరాతిలో 9 గీతాలు ఉంటాయి. ఈ గీతలు 9 జిల్లాలను సూచిస్తాయి.
నల్లరాతి స్తంబంపై భాగంలో ఎర్రరాతి వుంటుంది. ఈ ఎర్రరాతిలో అశోక చక్రం ఉంటుంది. ఈ చక్రం ధర్మాన్ని, సాహసాన్ని, నిజాయితీని సూచిస్తుంది.
ఈ స్థూపం చివరి భాగంలో 9 తెల్లరాతి పుష్పాలు ఉంటాయి. ఇవి శాంతి, త్యాగానికి చిహ్నంగా ఉంటాయి.
రమణారెడ్డి :
తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోను రూపొందించాడు.
గణపతి స్తపతి:
ఇతను ట్యాంక్‌బండ్‌లోని గౌతమబుద్ధుని రూపొందించాడు.
రవి శంకర్‌ (చెర్యాల) :
ప్రపంచ తెలుగు మహాసభల లోగోను రూపొందించాడు.

Spread the love