తెలంగాణ రాష్ట్ర ఉనికి

Existence of Telangana Stateగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో Geography అంటారు. Geography అనే వదం గ్రీకు భాష నుండి పుట్టినది. గ్రీకు: భాషలో  graphy అనగా భూమి, Geo అనగా రాయటం లేదా గీయటం అని అర్ధం. ఈ విదం Geography అనే రెండు రెండు పదాల కలయిక. భూ స్వరూపాలు, శీతోష్ణస్థితి, ఉద్భతి సంపద అంతు జలాల విస్తరణల అధ్యయనమే జాగ్రఫీ. భూగోళ శాస్త్ర పితామహుడి (Father of Geography)గా హికోటియస్‌ను పేర్కొంటారు.
తెలంగాణ ప్రాంతాన్ని పురాణాలలో దక్షిణపథం అని పేర్కొంటారు. దక్షిణ పథం అంటే నర్మద – తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం. అనగా దక్షిణ భారతదేశానికి దారి అని అర్ధం. ఇది ఉత్తర దక్షిణ దేశాల సంగమ స్థానం. ఢిల్లీ సుల్తానుల కాలంనాటి ఆమీర్‌ ఖుస్రో అనే కవి ”తెలంగాణ” అనే పదం ఢిల్లీ సుల్తానుల కాలం నాటి నుంచే పిలువబడేదని పేర్కొన్నాడు.
ఈజిప్షియన్‌ గ్రీడ అయిన ”టాలమి” తను రచించిన ”ది గైడ్‌ టు జియోగ్రఫీ” అనే గ్రంథంలో గోదావరి నదిని ”తెల్లివాహ” అని పేర్కొన్నారు. ”తైలంగులు” తెలంగాణ ప్రాంతంలో ”తెల్లివాహనది” ఒడ్డున నివసించేవారని పేర్కొన్నారు.
”తైలింగులు” అనే తెగ తెలంగాణ ప్రాంతం నుండి మయన్మార్‌ వలసవెళ్లినట్లు చారిత్రక ఆధారాలు కలవు. అందుకే తెలంగాణ ప్రజానికానికి తెలంగాణనైట్‌ అనే పేరు వచ్చింది.
ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త పరబ్రహ్మశాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం, తెలుగువారు నివసించిన ప్రాంతం త్రిలింగ దేశంగా వ్యవహరించబడింది. దీని ప్రకారం, ప్రస్తుత తెలంగాణను తొలి ఆంధ్రదేశానికి నాందిగా భావించాలి. తెలంగాణలో జీవ గోదావరిని ”తెలివాహ నది”గా వ్యవహరించేవారు. తద్వారా, ఈ నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలను త్రిలింగులుగా వ్యవహరించి, కాలక్రమంలో త్రిలింగ దేశంగానూ, తెలంగాణాగానూ స్థిరపడి ఉండొచ్చు.
సి. శ్రీరామశర్మ అభిప్రాయం ప్రకారం, అమీర్‌ ఖుస్రో నుంచి అబుల్‌ ఫజల్‌ మధ్యకాలంలో అంటే స్థూలంగా అల్లాఉద్దీన్‌ ఖిల్జీ నుంచి అక్బర్‌ కాలం మధ్యలో, తెలంగాణా అనే పేరు వ్యవహారికంగా మారింది. తెలంగాణ అనే పదం సంగారెడ్డిలోని తెల్లాపూర్‌ శాసనం (క్రీ.శ. 1417), ప్రతాప రుద్రగణపతి వెలిచర్ల శాసనం, శ్రీకృష్ణదేవరాయల తిరుమల, చిన్న కంచి శాసనాల్లో స్పష్టంగా పేర్కొనబడింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భాన నేపథ్యం – ముఖ్యమైన ఘట్టాలు, సంఘటనలు
వివిధ ప్రాంతాలలో వచ్చిన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ నేపథ్యంలో 1948లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటు అంశంపై ఎస్‌.కె. థార్‌ నేతృత్వంలో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ భాషా ప్రాతిపదిక రాష్ట్రాల వల్ల జాతికి ముప్పు అని తేల్చింది. కానీ బి.ఆర్‌. అంబేద్కర్‌ 1948 అక్టోబర్‌లో థార్‌ కమీషన్‌ సిఫార్సుల మేరకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును స్వాగతించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గురించి జైపూర్‌ కాంగ్రెస్‌ సమావేశం- 1948లో తీసుకున్న నిర్ణయాల అమలులో నెహ్రూ ప్రభుత్వం జాప్యం చేసింది. దీంతో అందరిలో అసంతృప్తి మొదలయింది. అక్టోబర్‌ 19, 1952 పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం అమరణ నిరాహార దీక్ష చేపట్టినాడు. దీక్షను 58 రోజుల పాటు కొనసాగించి మరణించాడు. కేంద్రప్రభుత్వం దిగివచ్చి 19 డిసెంబర్‌, 1952 ఆంధ్రులకు కొత్త రాష్ట్రం ఏర్పాటుకై వాంఛూ కమిటీని నియమించింది. సెప్టెంబర్‌ 1953లో ఆంధ్రరాష్ట్ర యాక్టు పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. అక్టోబర్‌ 1, 1953న కొత్త ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది.
ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కేంద్రంపై ఒత్తిడి ఎక్కువ అయింది. దీని ఫలితంగా భారత ప్రభుత్వం 29 డిసెంబర్‌ 1963న ఫజల్‌ అలీ నేతృత్వంలో ఓ కమీషన్‌ను ఏర్పాటు చేసింది. సెప్టెంబర్‌ 1955లో ఈ కమీషన్‌ 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఉభయ ప్రాంతాల పెద్దమనుషుల మధ్య ఒప్పందంతో 1956, నవంబర్‌ 1న విశాలాంధ్ర ఏర్పాటు అయ్యింది.
హైదరాబాద్‌ రాష్ట్రం
హైదరాబాద్‌ రాజ్యంపై భారత యూనియన్‌ చేపట్టిన ”ఆపరేషన్‌ పోలో” (1948, సెప్టెంబర్‌ 13 నుండి 17 మధ్య జరిగిన)తో 1948 సెప్టెంబర్‌ 18న నిజాం సంస్థానంలో మిలిటరీ ప్రభుత్వం ఏర్పడింది. జె. ఎస్‌. చౌదరి హైదరాబాద్‌లోని, చాలామంది యువకులను రజాకారులుగా అనుమానించి దారుణంగా హతమార్చాడని ఇతనిపై అభియోగాలు వచ్చాయి. ఇతని నేతృత్వంలోని సైన్యం గ్రామాలలో చొరబడి యువకులను, కమ్యూనిస్టులుగా భావించి వారిని హతమార్చినాడు. ఈ నేపథ్యంలో ప్రజావ్యతిరేక ఉద్యమం ఆవిర్భవించడంతో ”పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు (1950)” చేయడం జరిగింది. 1952లో హైదరాబాద్‌ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నుకొనబడ్డాడు.
1952 వరంగల్లో ప్రారంభమైన ముల్కీ ఉద్యమం, 1956, ఫిబ్రవరి 20న జరిగిన పెద్దమనుషుల ఒప్పందంలోని అంశాలు ఉల్లంఘన, 1969లో ఖమ్మంలో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. దీనితో ఏప్రిల్‌ 11న 1969 నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని ప్రకటించగా దీన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించి తిరిగి ఆందోళనలు చేపట్టారు. 1972లో సీమాంధ్రలో జై ఆంధ్ర ఉద్యమం మొదలయింది.
ఇరు ప్రాంతాల వారిని శాంత పరిచేందుకు 1973 సెప్టెంబర్‌ కేంద్రప్రభుత్వం 6 సూత్రాల పథకంతో పరిష్కారం చూపింది. దీన్ని సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ ఉద్యోగస్థులలో తీవ్ర అసంతృప్తి (దశాబ్ద కాలంగా) రగలడంతో ఉద్యోగాలలో తమకు అన్యాయం జరిగిందంటూ ఆందోళనలకు దిగడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 610 జీవోను తెచ్చింది. ఈ జీవోను అమలు చేయకపోవడం మూలంగా ఉద్యోగస్థులలో అసంతృప్తి రెట్టింపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మళ్లీ ఊపందుకుంది.
తెలంగాణ సిద్ధాంత కర్త ”ప్రొ. జయశంకర్‌ సార్‌” మార్గదర్శకత్వంలో కే.సి.ఆర్‌. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ ”తెలంగాణ రాష్ట్ర సమితి 2001, ఏప్రిల్‌ 27న స్థాపించారు. కే.సి.ఆర్‌ 2009, నవంబర్లో చేపట్టిన నిరాహార దీక్షతో కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు 9 డిసెంబర్‌, 2009న ప్రకటన చేసింది. కేంద్రప్రభుత్వం 03 ఫిబ్రవరి, 2010న శ్రీకృష్ణ కమిటీని నియమించి, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను పరిశీలించుటకు ఏర్పాటు చేయగా కమీషన్‌ 2010 డిసెంబర్‌లో తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. కె.సి.ఆర్‌. ఆధ్వర్యంలోని తెలంగాణా రాష్ట్ర సమితి (టి.ఆర్‌.ఎస్‌.) మరియు ప్రొ. కోదండరామ్‌ సార్‌ ఆధ్వర్యంలోని తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కీలక పాత్ర పోషించడంతో సిడబ్ల్యుసి 2013, జూలై, 30న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.
– 2013, ఆగస్టు 5న అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని లోక్‌సభలో ప్రకటించారు. 2013, అక్టోబర్‌ 3న కేంద్ర హోంశాఖ రూపొందించిన తెలంగాణ నోట్‌ను కేంద్రం ఆమోదించింది.
– 2014, ఫిబ్రవరి 6 కేంద్ర క్యాబినెట్‌ తెలంగాణ బిల్లును ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 13న అప్పటి కేంద్ర హోం శాఖామంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాడు.
– 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లుపై మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది.
– 2014, ఫిబ్రవరి 20న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పి.జె. కురియన్‌ ఆమోదంతో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
– 1 మార్చి, 2014న తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేస్తూ ఆమోదముద్ర వేశారు. అదేరోజు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.
– 2 మార్చి, 2014న కేంద్రం తెలంగాణ ఏర్పాటుకై ఆవిర్భావ తేది లేకుండా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
– 4 మార్చి, 2014న కేంద్రం తెలంగాణ ఆవిర్భావ దినంగా 2 జూన్‌, 2014 అని ప్రకటించింది.
– 2 జూన్‌, 2014న భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది.
నోట్‌: ”ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం- 2014”ను ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ (సవరలు) చట్టం- 2014 (2014, నవంబర్‌ 19)గా 17, 2014న సవరించబడింది ఈ సవరణ మే 20, 2014 నుంచి అమలు చేయడం జరిగింది.
దీని ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 327 రెవెన్యూ గ్రామాలను, 87 గ్రామ సంచాయితీలను అవశేష ఆంధ్రప్రదేశకు బదిలీ చేయడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ క్రింది ఏదు మండలాల్లో మొదటి అయిదు మండలాలను ఆంధ్రప్రదేశ్‌ పూర్తిగాను, చివరి రెండింటిని పాక్షికంగాను కలపడం జరిగింది. అవి 1. కూనవరం, 2. వేలేరు పాడు, 3. కుకునూరు, 4. వి.ఆర్‌. పురం, 5. చింతూరు 6 భద్రాచలం, 7 బూర్గంపాడు.
ఈ సవరణ చట్టం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం 2.76 లక్షల హెక్టార్ల విస్తీర్ణంను కోల్పోయినది. ఫలితంగా రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ. (పూర్వం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం (1,14,840 చ.కి.మీ. లకు కుదించబడినది. రాష్ట్రలో సుపరిపాలన అందించడానికి, ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రభావవంతంగా అమలు చేయాలనే ఉద్దేశ్యంతో 2016, అక్టోబర్‌ 11 విజయ దశమి పర్వదినాన, అనగా దసరా రోజున కొత్తగా 21 జిల్లాలు ఏర్పడడంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి చేరినది. పూర్వపు హైదరాబాద్‌ రాష్ట్రంలో మూడుసార్లు జిల్లాల పునర్వవస్థీకరణ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాంతంలోనిదే కనుక మార్పు తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది.
ప్రస్తుతం ”జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం- 1974” ప్రకారం తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి, రెవెన్యూ డివిజన్లు 68కి, మండలాలు 584కి పెరిగాయి. తెలంగాణలో చివరిసారిగా 1978 ఆగష్టు 15న రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. (1953లో ఖమ్మం)
రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రజల నిరసనల ఫలితంగా ముసాయిదా నోటిఫికేషన్లో ఇచ్చినవి కాకుండా. అదనంగా సిరిసిల్ల, జనగామ, గద్వాల్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు నేతృత్వంలో ఏర్పాటైన హైపవర్‌ కమిటీ సూచించినది. ఈ హైపవర్‌ కమిటీలో సభ్యులు-1 జోగురామన్న 2. పోచారం శ్రీనివాసరెడ్డి, 3. జగదీశ్వర్రెడ్డి.
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనను ”జనాభా, విస్తీర్ణాన్ని మరియు కుటుంబాల సంఖ్యను ప్రాతిపదికగా” తీసుకొని చేపట్టడం జరిగింది.
నవ్య తెలంగాణ నూతన సమాచారం
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్‌ 2న భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుండి విడిపోయి, 29వ రాష్ట్రంగా ఆవిర్భవించినది. తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారత ద్వీపకల్పంలో 77డిగ్రీల15 నుండి 81డిగ్రీల19 తూర్పు రేఖాంశాలు, 15ు50 నుండి 19..51 ఉత్తర అక్షాంశాల మధ్య నెలకొని ఉంది. హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు తెలంగాణ రాష్ట్రంలో సగటు జిల్లా జనాభా 35 లక్షలు అనగా దేశంలో మూడవ స్థానం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 10.3 లక్షలు అనగా దేశంలో రాష్ట్ర ర్యాంకు 17వ స్థానానికి పడిపోయినది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా సగటు విస్తీర్ణం 11,208 చ.కి.మీ. అనగా దేశం రెండవ స్థానం, మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్‌. ప్రస్తుతం జిల్లా సగటు భౌగోళిక విస్తీర్ణం రీత్యా 3,608 చ.కి.మీ. అనగా తెలంగాణ రాష్ట్ర ర్యాంకు 15కు పడిపోయింది.
గమనిక:- 1. నూతన ఆంధ్రప్రదేశ్‌ ”హైదరాబాద్‌” రాజధానిగా 100 ఏండ్ల వరకు ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వుంటుంది.
2) 1865లో మొదటి సాలార్‌జంగ్‌ అయిన సర్‌ మీర్‌ తురబ్‌ అలీఖాన్‌ హైద్రాబాద్‌ రాష్ట్రంలో జిలాబందీ. పేరుట 10 జిల్లాలను ఏర్పాటు చేశారు.
అప్పుడు తెలంగాణలో 8 జిల్లాలు కలవు. అప్పటి జిల్లాల సగటు విస్తీర్ణం 18,880 చ.కి.మీ. జిల్లా సగటు జనాభా 6.92 లక్షలు.

Spread the love