రోజా రేకులతో…

రోజా రేకులతో...ఎక్కువ మంది ఇష్టపడేవి.. చూడగానే ఎంతో అందంగా కన్పించే రోజా… ఇంట్లో పెంచుకునే పూలలో మొదటి వరుసలో ఉండేవి కూడా ఈ పూలే… ఈ పూలను గిఫ్ట్‌లుగా, బొకేలుగానే కాకుండా అందానికి, ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగ పడతాయి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. శరీరంపై మొటిమలు, నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో రోజా రేకుల ముద్దను రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. క్రమేపీ నల్లమచ్చలు తగ్గిపోతాయి.
– రోజా రేకులతో తయారు చేసే కషాయం కూడా ఆరోగ్యానికి మంచిది. ఇది చర్మానికి మెరుపును అందిస్తుంది.
– రోజా పూల నుంచి వచ్చే సువాసనను పీల్చడం వల్ల శారీరకంగానే కాక మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి దోహదపడుతుంది.
– వేడి నీటిలో రోజా రేకులు, బాత్‌సాల్ట్‌ వేయాలి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా పీల్చితే మెదడు చురుగ్గా ఉంటుంది.
– ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొద్దిగా మెంతులు, రోజా రేకులు కలిపి చేసుకున్న పేస్టును తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది. అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజూ ఇది తినడం వల్ల బరువు తగ్గుతారు.

Spread the love