Sunday, July 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళాభివృద్ధే దేశాభివృద్ధి

మహిళాభివృద్ధే దేశాభివృద్ధి

- Advertisement -

వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధం
రాష్ర్టంలో 67 లక్షల మహిళా పొదుపు సంఘాలు
వాటికి ఇచ్చిన రుణాలు రూ.16వేల కోట్లు
ఏటా వారికి అవార్డులు ఇవ్వాలి
‘ఫిక్కీ’ మహిళా పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్‌‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి అన్నారు. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనీ, ఆమేరకు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించామని స్పష్టం చేశారు. రాష్ర్టంలో 67 లక్షల స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాలు ఉన్నాయనీ, వాటిని దాదాపు రూ.16వేల కోట్ల రుణాలు ఇచ్చామని తెలిపారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ ‌కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీ (ఫిక్కీ) లేడీస్‌ ఆర్గనైజేషన్‌ స్థాపించి 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు శనివారం నాడిక్కడి డాక్టర్‌ ‌మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్‌‌సీహెచ్చార్డీ)లో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‌రాష్ర్టంలో మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసేందుకు 22 జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామనీ, త్వరలోనే ప్రారం భిస్తామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి భవనాలను శిక్షణ, మార్కెటింగ్, వ్యాపారానికి కేంద్రంగా పనిచేసేలా కార్పొరేట్ హంగులతో నిర్మిస్తు న్నామని చెప్పారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని శిల్పారామం పక్కనే రూ.వెయ్యి కోట్ల విలువైన స్థలాన్ని ఇందిరా మహిళా శక్తి బజార్‌ నిర్వహించడానికి కేటాయించామనీ, వీటిలో ప్రత్యేక సదుపాయాలతో గ్రామీణ హస్తకళలు, సాంప్రదాయ ఉత్పత్తులను విక్ర యించేందుకు కేటాయించిన 50కి పైగా దుకాణాలు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. మహిళా సాధికారత కోసం ఫిక్కీ అభ్యర్ధనలకు అత్యంత ప్రాముఖ్యతతో నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఫిక్కీ ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి శిల్పారామం పక్కనే వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తామనీ, హైటెక్ సిటీ, సిఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) కార్యాలయానికి మధ్యలో ఫిక్కీ కార్యాలయం ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సీఎం చెప్పారు. ‘ఫిక్కీ’ భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వామి కావాలని, దానికోసం ఆ సంస్థకు అక్కడ ఎకరం స్థలాన్ని కేటాయిస్తామన్నారు. రాష్ర్టంలో అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థ ఫ్యూచర్ సిటీలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందనీ, భవిష్యత్‌‌లో ప్రపంచ అగ్రగామి ఫార్చ్యూన్-500 కంపెనీలనన్నింటినీ ఇక్కడ నెలకొల్పడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో మరొక ఇండస్ట్రియల్ పార్క్ ను మహిళా సాధికారత కోసం అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో మహిళలు పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారనీ, ఆర్టీసీ అద్దె బస్సుల యజమా నులుగా మారారనీ, వెయ్యి మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లకు యజమానులుగా ఉన్నారని వివరించారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలు, విద్యార్థులకు యూని ఫారాలు కుట్టే బాధ్యతలను కూడా మహిళా స్వయం సహాయక బృందాలకే అప్పగించామని గుర్తుచేశారు. మహిళా సంఘాల ఉత్పత్తులను అమెజాన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విక్రయించే దిశగా పనిచేస్తున్నామన్నారు. వ్యాపారాల్లో గొప్పగా రాణిస్తున్న మహిళా సంఘాలకు ‘ఫిక్కీ’ ఆధ్వర్యంలో ఏటా అవార్డులు ఇచ్చి గౌరవించుకునే ఆనవాయితీ తీసుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ర్ట ఆర్థిక లక్ష్యాలను వారికి వివరించారు. కార్యక్ర మంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణా రావు, ఎఫ్ఎల్ వో జాతీయ అధ్యక్షురాలు పూజా గర్గ్, హైదరాబాద్ చైర్ పర్సన్‌ సీతా రెడ్డి గడ్డం తదితర మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -