అనుబోస్‌లో వెబ్‌ డెవలప్మెంట్‌పై వర్క్‌ షాప్‌

నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ మున్సిపల్‌ పరిధిలోని అనుబోస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ 3వ సంవత్సరం చదువుతున్న సిఎస్‌ఈ, ఈసీఈ విద్యార్థులకు తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ టాస్క్‌ ఆధ్వర్యంలో వెబ్‌ డెవలప్మెంట్‌పై మూడు రోజులు అవగాహన స్పేస్‌ జరిగింది. ఏ శిక్షణకు అకాడమీ తరుపున ట్రైనర్‌ జి.అశోక్‌ కుమార్‌, ఖమ్మం రీజినల్‌ సెంటర్‌ మేనేజర్‌ పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా విద్యార్థులకు కోర్సుకు సంబంధించి వెబ్‌ ప్రాముఖ్యత వెబ్సైట్‌ డెవలప్మెంట్‌లో, జావా స్క్రిప్ట్‌ ఆవశ్యకత ఫ్రంట్‌ అండ్‌ బ్యాక్‌ అండ్‌ మధ్య వ్యత్యాసం అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రెటరీ అండ్‌ డాక్టర్‌ టి.భరత్‌ కృష్ణ, డైరెక్టర్‌ డాక్టర్‌ టి.ఆవని మాట్లాడుతూ ఇటువంటి అరుదైన శిక్షణ తరగతులు విద్యార్థులకు అందిస్తున్న టాస్క్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. నేటి ఆధునిక యుగంలో ఇలాంటి శిక్షణ ప్రతి ఒక్కరికీ అవసరమని, తద్వారా మంచి ఉద్యోగ సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.రవికుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ జి.వెంకన్న, ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్మెంట్‌ ఆఫీసర్‌ ఇమ్మడి క్రాంతికుమార్‌, హెచ్‌ఓడీలు కే.నాగేంద్రబాబు, డాక్టర్‌ ఎన్‌.ప్రతాప్‌, ఎస్‌.సంధ్య, ఎల్‌.ప్రశాంత్‌, డి.అశోక్‌ కుమార్‌, డి.వీరస్వామి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love