– సుదర్శన్ టీవీ ఛానెల్ ఎడిటర్ అరెస్టు
న్యూఢిల్లీ: హర్యానాలోని నుహ్ ఇతర జిల్లాల్లో జరిగిన మత హింసకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే, రెచ్చగొట్టే పోస్ట్‌లను షేర్ చేసినందుకు హిందీ న్యూస్ ఛానెల్ ఎడిటర్‌ను గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. సుదర్శన్ న్యూస్ రెసిడెంట్ ఎడిటర్ ముఖేష్ కుమార్‌ను గురుగ్రామ్ సెక్టార్ 17 నుంచి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. శ్రీ కుమార్‌ను కొందరు కిడ్నాప్ చేశారని సుదర్శన్ ఛానెల్ మొదట పేర్కొన్నది. అయితే, సైబర్ క్రైమ్ విభాగం అతడిని అరెస్టు చేసినట్టు గురుగ్రామ్ పోలీసులు స్పష్టం చేశారు. ” కతర్ కేంద్రంగా పని చేసే అల్‌జజీరా న్యూస్ చానెల్ నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే గురుగ్రామ్ పోలీసులు ‘హిందూ కార్యకర్తల’కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు” అని ముఖేశ్ కుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.నుహ్ లో చోటు చేసుకున్న మత ఘర్షణల్లో ఆరుగురు చనిపోగా, పలువురు గాయపడిన విషయం విదితమే.