ఢిల్లీ ధర్నాలో పాల్గొన్న యాదాద్రి జిల్లా నాయకులు

నవతెలంగాణ –  భువనగిరి రూరల్ 
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్  పిలుపుమేరకు గురువారం శుక్రవారం  దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా , ఈరోజు నేషనల్ ఓబీసీ కాన్ఫరెన్స్ హాల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు జిల్లా బీసీ సంఘం నాయకులు  తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికలకు ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న బీసీల లెక్కలను తేల్చాలని, దేశంలో జంతువులకు లెక్కలు ఉన్నాయనీ బలహీన వర్గాల లెక్కలు లేకపోవడం చాలా బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 50% ఉన్నటువంటి బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం టికెట్లు ఇచ్చేలాగా పార్లమెంటులో కేంద్రం చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పది సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ఓబీసీ అని చెప్పుకుంటున్న కనీసము బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని,  ఇప్పుడు ఎన్నికల ముందు నేను కూడా ఓబీసీ ని అని నరేంద్ర మోడీ చెప్పుకుంటున్నాడు అన్నారు. త్వరలోనే ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో లక్షలాది బీసీ ప్రతినిధులతో ఒక సభను నిర్వహించి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, జిల్లా నుండి వరికుప్పల మధు, గూడూరు భాస్కర్ , బీసీ నాయకులు పాల్గొన్నారు.
Spread the love