మీరు నీషాను క‌ల‌వాల్సిందే

మీరు నీషాను క‌ల‌వాల్సిందేసమాజంలో అమ్మాయిలకు తమ ఇష్టాలను చెప్పే ధైర్యం లేదు. తమ కంటూ ఓ చాయిస్‌ ఉండదు. చాలా మంది జీవితంలో ఏదో సాధించాలని కలలు కంటుంటారు. కానీ రకరకాల కారణాల వల్ల తమ కలలను కలలుగానే మిగుల్చుకుంటున్నారు. అటువంటి అమ్మాయిల్లో స్ఫూర్తి నింపే గేమ్‌ షో గో నిషా గో. నిషా అనే ఓ కల్పిత పాత్రతో రూపొందించిన ఈ గేమ్‌ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎంతో మంది అమ్మాయిల్లో ధైర్యం నింపుతుంది. ఇంతకీ ఆ గేమ్‌ ఏంటో, దాన్ని ఎవరు రూపొందించారో తెలుసుకుందాం…
ఢిల్లీలోని దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నిషా అనే 19 ఏళ్ల అమ్మాయి టీచర్‌ కోర్స్‌ చేస్తోంది. ఆమెకు కొన్ని కలలు, ఆశయాలు ఉన్నాయి. కానీ ఆమె జీవిత ప్రయాణం అంత సులభం కాదు. ఆమె కుటుంబ నేపథ్యం అలాంటిది. తను ఏం చేయాలనుకున్నా కొన్ని పరిమితులు తప్పవు. కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా నిషా ఇప్పుడు మొబైల్‌ గేమ్‌ అయిన గో నిషా గోలో భాగమయింది. భారతదేశంలోని 116 మిలియన్ల మంది యుక్తవయసులో ఉన్న బాలికల్లో ఆమె కూడా ఒకటైపోయింది. ఈ వయసులోని అమ్మాయిలకు చాలా వరకు సామాజిక పరమైన విషయాలపై అవగాహన ఉండదు. వారికి ఏం కావాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాంటి అమ్మాయిలను ఈ గేమ్‌ సరైన పద్దతిలో సన్నద్ధం చేస్తుంది. తద్వారా వారి పునరుత్పత్తి ఆరోగ్యం గురించి మెరుగైన నిర్ణయాలు తీసుకోగలరు. అలాగే వారి కుటుంబ నిర్మాణాలలో మరింత సమాచారం ఇవ్వగలరు.
గో నిషా గో
గో నిషా గో అనేది 70 ఏండ్ల కిందట సుసాన్‌ హోవార్డ్‌ తల్లి కృషికి ఫలితం. హోవార్డ్‌ డెలాఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌  సహ వ్యవస్థాపకురాలు. ఇది సామాజిక, పర్యావరణ, ఆరోగ్య సవా ళ్లను పరిష్కరించే సంస్థ. దీన్ని మహిళల బృందం నిర్వహిస్తుంది. హెచ్‌డిఐ అనేది ‘గేమ్‌ ఆఫ్‌ చాయిస్‌, నాట్‌ ఛాన్స్‌’ నినాదంతో దేశంలో USAID నిధుల ద్వారా నడుస్తున్న సామాజిక ప్రాజెక్ట్‌. 15 నుండి 19 ఏండ్ల మధ్య వయసు గల బాలికల కోసం గో నిషా గోను ప్రారంభించింది. ‘మా అమ్మకు యువతిగా స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. పెద్ద చదువులు చేయడమే కాకుండా యుఎస్‌లో చదవాలనే ఆశయం ఉంది. తన చదువు కోసం పెండ్లిని వాయిదా వేసింది. గ్రాడ్యుయేషన్‌ తర్వాత పెండ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పించింది. ఆమె తన ఆశయాలకు అనుగుణంగా తన ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోకపోతే ఆమె జీవితం ఎలా ఉండేదో అని నాకు అనిపిస్తుండేది’ అని హోవార్డ్‌ చెప్పారు.
అనేక ప్రశ్నలు అడిగాము
Go Nisha Go Google Play Store లో ఉచితంగా లభిస్తుంది. ప్రస్తుతం దీనికి 4.4 రేటింగ్‌ ఉంది. మొబైల్‌ గేమ్‌ వినియోగదారుని ఐదు వేర్వేరు స్థాయిల ద్వారా ఇది తీసుకువెళుతుంది. నిషా తన పాత్ర ద్వారా ద్వారా నైపుణ్యాలను అన్వేషించడానికి, నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందేందుకు అమ్మాయిలకు సహాయం చేస్తుంది. గేమ్‌ ఆఫ్‌ చాయిస్‌, నాట్‌ ఛాన్స్‌లో కంట్రీ డైరెక్టర్‌, ఇండియా టీమ్‌ లీడ్‌ అయిన కవితా అయ్యగారి మాట్లాడుతూ ‘ఇదంతా ఒక చిన్న  గ్రాంట్‌తో ప్రారంభమైంది. తర్వాత మేము గర్ల్‌ ఎఫెక్ట్‌ అనే సంస్థతో కలిసి ఢిల్లీ, రాజస్థాన్‌, బీహార్‌లలో 200 మంది అమ్మాయిలపై పరిశోధన చేశాము. కౌమారదశలో వారు ఎదుర్కొనే సమస్యలపై అనేక ప్రశ్నలు అడిగాము. గుర్తింపు, కదలిక, లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యం, రుతుక్రమంపై సవాళ్లు ఎదురైనప్పుడు మీరు ఎవరికి చెప్పుకుంటారనే ప్రశ్నలు అడిగాము’ అని పంచుకున్నారు. ఏ సలహా దొరకక, ఏ దారి కనిపించక అయోమయంలో ఉన్న అమ్మాయిలకు నిషా గేమ్‌ ఒక దారి చూపుతుంది. వారిలో ధైర్యాన్ని నింపుతుంది. ఈ గేమ్‌ మెన్‌స్ట్రూయెల్‌ హెల్త్‌ హెల్ప్‌లైన్‌తో సహా రకరకాల ఆరోగ్య అంశాలకు సంబంధించిన ఉత్పాదనలు, సేవలు, మహిళల సమస్యలపై పని చేసే స్వచ్ఛంధ సంస్థలకు సంబం ధించిన వీడియో లింక్‌లను అందిస్తుంది.
నిర్ణయాలు, ఎంపికలు
నిషా ఇప్పుడు తన స్మార్ట్‌ డైరీతో తన హృద యాన్ని పంచుకుంటుంది. తన జీవితం అడుగడు గునా కొత్త మలుపులు తిరుగుతున్నప్పుడు వచ్చే చిన్న చిన్న సందేహాలను పరిష్కరించుకోగలుగుతుంది. వినియోగదారులు 15 ఏండ్లు పైబడి ఉన్నారని యాప్‌ నిర్ధారించిన తర్వాత గేమ్‌ లెవెల్‌ 1తో మొదల వుతుంది. నిషా తాను ధరించే బట్టల విషయంలో తరచూ తండ్రితో గొడవ పడుతుండేది. ఇవి ఇంగ్లీష్‌, హిందీ (హింగ్లీష్‌) కలగలిపిన భాషలో ఉంటాయి. ఈ సీరిస్‌ మొత్తం గో నిషా గో, జీ లే అప్నీ జిందగీ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రారంభమవుతాయి.
నిర్ణయాధికారం…
లెవెల్‌ 2లో నిషా డాక్టర్‌ ఘోష్‌తో కలిసి సిక్కింకు వెళుతుంది. అక్కడ వారు పీరియడ్‌ ఉత్పత్తులను చేసే ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను నడుపుతున్న డాక్టర్‌ అరుణను కలుసు కుంటారు. ఈ లెవల్‌ రుతు ఆరోగ్యంపై దృష్టి పెడుతుంది. లెవల్‌ 3లో నిషా షిరీన్‌ మిస్త్రీ అనే యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కలుసుకుంటుంది. ఆమె తన ఇష్టాలు ఏమిటో చెప్పడం గురించి మాట్లాడుతుంది. ‘ఆ వీడియోలో ఆమె ఆయుష్‌తో ప్రేమలో పడుతుంది. అతను ఆమెను ముద్దు అడుగుతాడు. ఆమె సమాధానం ఏంటి అనేది ఆమె ఇష్టం. ఆమెకు ఆ ఎంపిక ఉంది. ఆమె తీసుకునే నిర్ణయాలు, దాని వల్ల వచ్చే ఫలితాలను ఎదుర్కొనే శక్తి కూడా ఆమెకు ఉంటుంది’ అని అయ్యగారి చెప్పారు.
డైనమిక్‌ ముగింపు
ఈ యాప్‌ టెక్‌సాఖి, రతీ ఫౌండేషన్‌, ప్రాజెక్ట్‌ న్యాయరీ వంటి మహిళలు నడిపే ఎన్‌జీఓల హెల్ప్‌లైన్‌లకు లింక్‌లను కూడా అందిస్తుంది. నాల్గవ ఎపి సోడ్‌లో నిషా నర్సు-ఆంట్రప్రెన్యూర్‌గా కని పిస్తుంది. సంభాషణ అసురక్షిత సెక్స్‌, గర్భ నిరోధకం, వైద్యుడిని సంప్రదించడం, సంబంధంలో అవును లేదా కాదు అని చెప్పే ఎంపికపై కేంద్రీకృతమై ఉంటుంది. నిషా తల్లిదండ్రులు ఆమెకు పెండ్లి చేయడానికి అబ్బాయిని చూస్తారు. ఆమె ఆయుష్‌ గురించి తన తల్లిదండ్రులకు చెబుతుందా, లేదా, ఇప్పుడే పెండ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పి జర్నలిస్ట్‌ కావాలనే తన ఆశయాన్ని కొనసాగిస్తుందా? లేదా అనే విషయాన్ని ఈ ఎపిసోడ్‌ డైలమాలో ఉంచుతుంది.
నిధులు అవసరం
Go Nisha Go Google  ఇప్పటివరకు 3 లక్షల డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. గేమ్‌ ప్రచారానికి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను ఉపయోగించుకున్నారు. ‘దీన్ని ప్రారంభించిన మొదటి నెలలో మూడు రాష్ట్రాల్లో (ఢిల్లీ, రాజస్థాన్‌, బీహార్‌) ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో టైఅప్‌ చేసాము. నిషా సే మిలే క్యా (మీరు నిషాను కలిశారా?) అనే ప్రచారాన్ని కూడా నిర్వహించాము. నిర్దిష్ట విషయాల గురించి మాట్లాడటానికి, ఆటను ప్రోత్సహించడానికి అమ్మాయిలకు శిక్షణ ఇవ్వడానికి ఒక భాగస్వామితో కలిసి పని చేస్తున్నాము’ అని ఆమె జతచేశారు. గేమ్‌ ఆఫ్‌ చాయిస్‌, నాట్‌ ఛాన్స్‌ను ఇతర భాషల్లో డెవలప్‌ చేయడానికి నిధుల కోసం చూస్తున్నాయని, అన్ని రాష్ట్రాల్లో డౌన్‌లోడ్‌ చేస్తున్నారని అయ్యగారి చెప్పారు. నేపాల్‌లోని బాలికల కోసం ఒక గేమ్‌ను అభివృద్ధి చేయడానికి ఇటీవల ఇది గ్రాంట్‌ను కూడా పొందింది.
– సలీమ

Spread the love