– హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి
నవతెలంగాణ – హైదరాబాద్ : యువ న్యాయవాదులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి సూచించారు. స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీఓ) ‘పి.ఆర్ ఫౌండేషన్ ఫర్ సొసైటీ వెల్‌నెస్ అండ్ ఎంపవర్‌మెంట్’ వ్యవస్థాపకులు, హైకోర్టు న్యాయవాది పోనంపల్లి రవి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మూడురోజుల వర్క్‌షాప్‌లో రెండో రోజు కూడా కొనసాగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి హాజరై ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా యువ, జూనియర్ న్యాయవాదులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. డ్రాఫ్టింగ్, రెవెన్యూ, సివిల్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, న్యాయవాదుల బాధ్యత, కోర్టులో రాణించే మెళుకువలు సహా పలు అంశాలపై మాట్లాడారు. యువ న్యాయవాదులకు పలు విలువైన సూచనలు చేశారు. వేసవిలో ఇలాంటి వర్కషాప్ నిర్వహించినందుకు ఎన్జీఓను జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు జూనియర్, యువ న్యాయవాదులు పాల్గొని, వక్తలు చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్నారు. వర్క్‌షాప్ మూడోరోజైన శనివారం కూడా కొనసాగనుందని ఎన్జీఓ ప్రతినిధులు తెలిపారు.
యువ న్యాయవాదులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


