ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన నూతన్‌

మిస్‌ ఇండియా అవార్డు అందుకున్న తొలి మహిళ ‘నూతన్‌’ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తన అందంతో బాలీవుడ్‌లో అందరి మనసులను గెలుచుకున్న నూతన్‌ నటించిన సినిమాలను ఈనాటికీ కూడా సినీప్రియులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. అద్భుతమైన విజయాలతో ప్రముఖ పాత్రలు పోషించిన నూతన్‌ భారత ప్రభుత్వం అందించే నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం ”పద్మశ్రీ” తో పాటు హిందీ చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటిగా ఆరు ఫిలింఫేర్‌ పురస్కారాలని అందుకున్న నటిగా రికార్డు సష్టించింది. నాలుగు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో దాదాపు 70 పై చిత్రాలలో నటించిన నూతన్‌ సాంప్రదాయేతర పాత్రలను పోషించడంలో ప్రముఖంగా నిలిచింది. నూతన్‌ సమర్థ్‌ 1936 జూన్‌ 4న బొంబాయిలో మరాఠీ హిందూ కుటుంబం లో సినీదర్శకుడు, కవి కుమార్‌సేన్‌ సమర్థ్‌, నటి, సినీనిర్మాత శోభన దంపతుల నలుగురు పిల్లల్లో పెద్ద అమ్మాయిగా జన్మించింది. ఆమెకు ఇద్దరు సోదరీ మణులు నటి తనూజ, చతుర, ఒక సోద రుడు జైదీప్‌ ఉన్నారు. అయితే జైదీప్‌ పుట్టక ముందే ఆమె తల్లిదండ్రులు కుమార్‌సేన్‌ సమర్థ్‌, శోభన విడిపోయారు. నూతన్‌ ప్రాథమిక విద్య విల్లా థెరిస్సా స్కూల్‌లో జరిగినా, ఆ తర్వాత బెంగళూరులోని బాల్డ్‌విన్‌ గర్ల్స్‌ హైస్కూల్‌లో చదువుకుంది. చిన్నతనం లోనే కళల పట్ల ఆకర్షితురాలైన నూతన్‌ పాడటంతో పాటు నత్యం అంటే ఇష్టం ఏర్పరచుకుని, జగన్నాథ్‌ ప్రసాద్‌ దగ్గర నాలుగేండ్ల పాటు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. సినిమాతో సంబంధం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నూతన్‌ తల్లి శోభన నటి, తండ్రి కుమార్‌సేన్‌ సమర్థ్‌ సినీ నిర్మాత కావడం వల్ల ఆమె తన తల్లి శోభనతో కలిసి షూటింగ్‌ చూడటానికి వెళ్లేది. నూతన్‌ మొదట బాలనటిగా 1945లో తన తండ్రి చిత్రం ‘నల్‌ దమ యంతి’లో కెమెరా ముందు కొద్దిసేపు కనిపించింది. ఆ తర్వాత తన 14వ ఏట 1950లో తల్లి శోభన దర్శకత్వం వహించిన ‘హమారీ బేటీ’ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించిన నూతన్‌ 1952లో ‘ఫెమినా మిస్‌ ఇండియా’ పోటీలో విజేతగా నిలిచింది.
సినీ రంగ ప్రవేశం
నూతన్‌ సినీ రంగ ప్రవేశం చాలా హడావిడిగా జరిగింది. సినిమాల్లో శోభన అంతంత మాత్రమే రాణించడంతో, కుటుంబం ముందుకు సాగడానికి పద్నా లుగేండ్లు కూడా నిండని చదువుకుంటున్న నూతన్‌ను స్కూల్‌ మాన్పించి, హీరోయిన్‌ గా పెట్టి తన దర్శకత్వంలోనే ‘హమారి బేటీ’ సినిమా తీసింది. ఈ చిత్రం నూతన్‌ను స్టార్‌ని చేయలేకపోయింది. ఒక సమయం లో నూతన్‌ను స్టార్‌ని చేసేందుకు ఆమె చేత బికినీ వేయించేందుకు కూడా తల్లి శోభనా వెనుకాడలేదు. అందరి దష్టిలో పడిన నూతన్‌కు ఆ తర్వాతి ఏడాది కథానాయకిగా 1951లో రవీంద్ర దేవ్‌ రూపొందించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘నాగినా’ చిత్రంలో నటించే అవ కాశం వచ్చింది. ఈ చిత్రం కమర్షియల్‌గా విజయాన్ని సాధించి, నూతన్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇదే ఏడాది విడుదలైన సాంఘిక చిత్రం ‘హమ్‌ లాగ్‌’ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. జియా సర్హాది దర్శకత్వంలో మధ్యతరగతి కుటుంబ కష్టాల నేపథ్యంలో రూపొందిం పబడిన ఈ చిత్రంలో క్షయవ్యాధితో బాధ పడుతున్న ఔత్సాహిక రచయిత్రి కుమార్తె పారో పాత్రలో నూతన్‌ నటించింది. ‘నగీనా, హమ్‌ లాగ్‌’ చిత్రాల విజయం వర్ధమాన తారగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేసినప్పటికీ, బరువు తగ్గి బలహీనమ వ్వడం వంటి కారణాలతో సినిమాలలో నటించడం ఆపి, పై చదువుల కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్ళింది. అక్కడ ”లా చాటె లైన్‌ ఫినిషింగ్‌ స్కూల్‌”లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, ఒక ఏడాది తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన నూతన్‌ తర్వాత 1955లో విడుదలైన ‘సీమ’ చిత్రంలో దేవ్‌ ఆనంద్‌ తో కలిసి, సంస్కరణ గహంలో అపరాధి గా నటించింది. ఆమె కెరీర్‌లో ఈ చిత్రం పెద్ద బూస్ట్‌గా నిలిచి, ప్రేక్షకులు, విమర్శకు లచే ప్రశంసించబడడమే కాకుండా, నూతన్‌ ఉత్తమనటిగా తన మొదటి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును కూడా గెలుచుకుంది. 1957లో ‘పేయింగ్‌ గెస్ట్‌’, ఆ తర్వాత 1958లో ‘దిల్లీ కా థగ్‌’ వచ్చింది, ఇందులో నూతన్‌ తెరపై బికినీ ధరిం చింది. 1959లో నూతన్‌, రాజ్‌కపూర్‌లతో ‘అనారి’, నూతన్‌, సునీల్‌ దత్‌లతో బిమల్‌ రారు నిర్మించిన ‘సుజాత’ ఈ రెండు చిత్రాలు హిట్‌ అయ్యాయి. 1960, 70లలో నూతన్‌ ”ఛలియా, సరస్వతీ చంద్ర, దేవి, మెయిన్‌ తులసి తేరే ఆంగన్‌ కీ, తెరె ఘర్‌ కే సామ్‌నే, సూరత్‌ ఔర్‌ సీరత్‌, దిల్‌ హారు తో హై, లాత్‌ సాహెబ్‌, మా ఔర్‌ మమత, చండీ కి దీవార్‌” వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటిం చింది. అయితే బిమల్‌ రారు నూతన్‌తో తీసిన ‘సుజాత’ ఆమెకు స్టార్‌డమ్‌ని, గుర్తింపుని తీసుకొచ్చింది. 1962లో ‘బిమల్‌రారు’ ఆమెతో తీసిన మరో చిత్రం ‘బందినీ’ ఘన విజయం సాధించి ఆమె ను సూపర్‌ స్టార్‌ని చేసింది. అందులో జైలు శిక్ష పడ్డ ఖైదీగా నూతన్‌ ప్రదర్శించిన నటన ప్రేక్షకులతో పాటు విమ ర్శకులను కూడా ఆకట్టు కుంది. ఆ తర్వాత నూతన్‌ నటించిన చిత్రాలు హిట్‌ సాధించాయి. ఇండిస్టీలో గొప్ప స్టార్‌డమ్‌ సంపాదించుకున్న, తల్లి శోభన కు నూతన్‌ అంటే ఎందుకనో ఇష్టం వుండేది కాదు. రెండో కూతురు ‘తనూజా’ పెద్ద హీరోయిన్‌ కావాలని అనుకుంది. కానీ, తనూజ నటిగా కొద్ది సినిమాలకే పరిమితమయ్యింది. నటిగా కొనసాగు తున్న సమయంలోనే నూతన్‌ తల్లి శోభన తో నిమిత్తం లేకుండా 1959 అక్టోబరు 11న భారత నావికాదళానికి చెందిన లెఫ్టినెంట్‌-కమాండర్‌ ‘రజనీష్‌ బాV్‌ా్ల’ ను వివాహం చేసుకుంది. వివాహానంతరం నటనకు స్వస్తి చెప్పిన ఆమెను ‘బందిని’ చిత్రంలో నటించమని భర్త ఒప్పించడం విశేషం. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించి, ఈ చిత్రంలోని పాత్ర భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమంగా నిలి చింది. నూతన్‌ ”అశోక్‌ కుమార్‌, దిలీప్‌ కుమార్‌, ధర్మేంద్ర, సంజరు దత్‌, రాజ్‌ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌” వంటి అగ్ర నటులతో కలిసి నటించినప్పటికీ, దేవ్‌ ఆనంద్‌తో జంటగా కలిసి ”పేయింగ్‌ గెస్ట్‌, బారిష్‌, మంజిల్‌, ఘర్‌ కే సామ్నే” అనే నాలుగు చిత్రాలలో నటించి ప్రముఖ స్క్రీన్‌ జంటగా గుర్తింపు పొందింది. నూతన్‌ హీరోయిన్‌గా తన కెరీర్‌ ముగిసిన తర్వాత 1981 లో ‘సాజన్‌ కీ సహేలీ’, 1982 లో ‘తేరీ మాంగ్‌ సితారోన్‌ సే భర్‌ దూన్‌’, ‘జీయో ఔర్‌ జీనే దో’, 1983 లో ‘రిష్తా కాగజ్‌ కా’, 1985 లో ‘కర్మ’, ‘మేరీ జంగ్‌’, 1986 లో ‘నామ్‌’ వంటి చిత్రాలలో ఎక్కువగా తల్లి పాత్రలను పోషించింది. నూతన్‌ ‘మేరీజంగ్‌’లో తన పాత్రకు ‘ఉత్తమ సహాయ నటి’గా ఆరవ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును గెలుచుకుంది. నూతన్‌ టీవీ సీరియల్‌ ‘ముజ్రిమ్‌ హజీర్‌’లో కలిగంజ్‌కి బహుపాత్రలో కూడా అద్భుతమైన నటనను ప్రదర్శిం చింది. చిన్న తెరపై ఆమె నటించిన ఏకైక సీరియల్‌. 1989లో విడుదలైన చిత్రం ‘కనూన్‌ అప్నా అప్నా’ నూతన్‌ జీవించి ఉండగా విడుదల అయిన చివరి చిత్రం.
తెలుగు తెరపై..
1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ సినిమాలో నటించడం ద్వారా నూతన్‌ తొలిసారి తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటుడు కష్ణంరాజు హాస్యనటి రమాప్రభ వెండితెరకు పరిచయమయ్యారు. ‘నూతన్‌’ ఇందులో పాత్ర పోషించడమే కాకుండా, ఇందులో ఒక పాట పాడటం కూడా విశేషం. ‘మూగమనసులు’ సినిమాని హిందీలో ‘మిలన్‌’గా తీస్తున్నప్పుడు ఆదుర్తి సుబ్బారావు సావిత్రి పాత్రకు నూతన్‌నే ఎంచుకున్నారు.
అవార్డులు
1951లో తొలి ‘మిస్‌ ఇండియా’ గా ఎంపికయిన నూతన్‌ 1974లో భారత ప్రభుత్వం అందించే నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం ”పద్మశ్రీ” ని అందుకుంది. నూతన్‌ 1955లో నటించిన ‘సీమ’ సినిమాలో ఉత్తమనటిగా మొదటి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు లభించగా, 1959 లో ‘సుజాత’, 1963 లో ‘బందిని’, 1967 లో ‘మిలన్‌’, 1970 లో ‘మైనే తులసీ తేరే ఆంగన్‌ కి’ అనే మొత్తం ఐదు చిత్రాలకు నూతన్‌ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను గెలుచుకుంది. 1985లో ‘మేరీ జంగ్‌’ సినిమాలోని తన పాత్రకు ఉత్తమ సహా యనటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవా ర్డును గెలుచుకుని, ఆరు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందు కున్న తొలినటిగా నిలి చింది. అయితే తన సోదరి తనూజా ముఖర్జీ కుమార్తె కాజోల్‌ 2011లో ఈ ఈ రికార్డును బద్దలు కొట్టే వరకు ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటిగా ఐదు, ఉత్తమ సహయ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు పొందిన ఏకైక మహిళా నటిగా గుర్తింపు పొందింది. నూతన్‌ బెంగాల్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఉత్తమ నటి అవార్డు 1963లో ‘బందిని’, 1973లో ‘మిలన్‌’, 1974లో ‘సౌదాగర్‌’ చిత్రా లకు అందుకుంది. 2011 లో భారత ప్రభుత్వం నూతన్‌ గౌరవార్థం ఆమె ముఖ చిత్రంతో కూడిన పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. ప్రముఖ మరాఠీ రచయిత్రి ‘లలితా తమ్హానే’ ‘నూతన్‌- అసెన్‌ మి నాసెన్‌ మి’ అనే పుస్తకంలో నూతన్‌ జీవితానుభవాలు, సహ నటులు, కుటుంబం, స్నేహితుల అభిప్రా యాలతో కూడిన పుస్తకం వెలువడింది.
క్యాన్సర్‌తో మతి
అందంతో బాలీవుడ్‌లో అందరి మనసులను అందుకుని, తన నటనతో ఇండిస్టీలో చెరగని ముద్ర వేసిన నూతన్‌ 54 ఏళ్ల వయస్సులో రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ 1991 ఫిబ్రవరి 21న ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పింది. నూతన్‌ మరణంతో బాలీవుడ్‌ గొప్ప నటిని కోల్పో యింది. నూతన్‌ మరణించే కొన్నాళ్ల ముందువరకూ కూడా మాటలకు దూరం గా ఉన్న తల్లి శోభన చివరి సమయంలో మాత్రం కొంచెం దగ్గరయ్యి నూతన్‌ కు ఊరట కలిగిం చింది. కాగా నూతన్‌ మర ణించే నాటికి ‘గరాజ్‌న’ సినిమా షూటింగ్‌లో ఉంది. అయితే ఈ చిత్రం విడుదలకు నోచుకోకున్న, నూతన్‌ మరణానికి ముందు నటించిన చిత్రాలు 1992లో ‘నసీబ్వాలా’ 1994లో ‘ఇన్సా నియత్‌’ విడుదలయ్యాయి. ప్రస్తుతం నూతన్‌ కుమా రుడు ‘మోహ నీష్‌ బాV్‌ా్ల’తో పాటు, ఆమె సోదరి ‘తనూజా ముఖర్జీ కుమార్తె కాజోల్‌’ హిందీ సినిమాల్లో నటిస్తున్నారు.
– పొన్నం రవిచంద్ర,
9440077499

Spread the love