వైకల్యాన్ని జయించి… లక్ష్యాన్ని సాధించిన మహనీయుడు లూయిస్‌ బ్రెయిలీ

నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌
వైకల్యాన్ని జయించి… లక్ష్యాన్ని సాధించిన మహనీయుడు లూయిస్‌ బ్రెయిలీ అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని సూరారం లూయిస్‌ భవనంలో ఏర్పాటు చేసిన లూయిస్‌ బ్రెయిలీ 214వ జయంతి వేడుకల్లో ఆదివారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దర్గ దయాకర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారితో కలిసి బ్రెయిలీ క్యాలెండర్‌ను ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేసి ఎమ్మెల్యే మాట్లాడుతూ… లూయిస్‌ బ్రెయిలీ వైకల్యాన్ని జయించి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన మహనీయుడని కొనియాడా రు. దివ్యాంగులకు రూ.3116 పింఛన్‌ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడం దేశానికి ఆదర్శమన్నారు. దివ్యాంగులూ సమాజంలో అందరితో సమానులేనన్నారు. త్వరలోనే దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ది బ్లైండ్‌ తెలంగాణ స్టేట్‌ బ్రాంచ్‌ ప్రెసిడెంట్‌ వీసీ వీరరాఘవన్‌, వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డిసేబుల్డ్‌ ప్రెసిడెంట్‌ జి.అంజయ్య, సారా ప్రవీణ్‌ కుమార్‌ గౌడ్‌, డివిజన్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మన్నే రాజు, రవీందర్‌ ముదిరాజ్‌, వెంకటస్వామి, పందిరి యాదగిరి, రాజకుమార్‌, తారా సింగ్‌, లూయిస్‌ బ్రెయిలీ సూరారం అసోసియేషన్‌ సభ్యులు సత్యం, ఎస్‌ రాజకుమార్‌, నరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love