ప్రజలకు క్షమాపణలు

నవతెలంగాణ – హైదరాబాద్
అధ్వానంగా మారిన రోడ్లపై సాక్షాత్తూ మంత్రి ప్రజలకు క్షమాపణలు కోరిన ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో రోడ్డు దుస్థితికి క్షమాపణలు  చెపుతూ ఆ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ ఓ వ్యక్తి పాదాలను కడిగి సంచలనం రేపారు.
‘‘రోడ్డు దుస్థితికి నేను ప్రజలకు క్షమాపణలు చెపుతున్నాను, మురుగునీటి పైపులైన్ పని కోసం తవ్విన రహదారిని బాగు చేస్తానని హామీ ఇస్తున్నాను’’ అని మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ చెప్పారు. రోడ్డు నిర్మాణం డిమాండ్‌పై చెప్పులు లేకుండా నడుస్తున్న ఎంపీ మంత్రి మళ్లీ చెప్పులు ధరించారు.పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తనకు ఒక జత చెప్పులు అందజేస్తున్న వీడియోను తోమర్ ట్వీట్ చేశారు.

Spread the love