చైనాలో కొండచరియలు విరిగిపడి 47 మంది మృతి

నవతెలంగాణ – బీజింగ్‌: చైనాలో ఘోర ప్రమాదం కొండచరియలు విరిగిపడి 47 మంది సజీవ సమాధి అయ్యారు. వందల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రోజు తెల్లవారుజామున యునాన్‌ ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాలను స్థానిక మీడియా కథనాల్లో పేర్కొంది. ఈ ఘటనలో పలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. వాటికింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

Spread the love