ప్రగతి యాత్రలో భాగంగా 66వ రోజు ఎమ్మెల్యే పర్యటన

నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌
కుత్బుల్లాపూర్‌ 131 డివిజన్‌ పరిధిలోని వాజ్‌ పారు నగర్‌ లో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా 66వ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ బుధవారం పర్యటించారు. మాజీ కార్పొరేటర్‌ కేఎం గౌరేష్‌తో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన సీసీ రోడ్లు పరిశీలించారు. కాగా తమ బస్తీ అభివద్ధికి ఎల్లవేళలా సహాయ సాకారాలు అందిస్తున్నందుకు ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికి, కతజ్ఞతలు తెలిపారు. అనంతరం మిగిలిన భూగర్భ డ్రయినేజ్‌, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి కషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. దాంతో ఎమ్మెల్యే త్వరలోనే వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ పాపమ్మ, మాజీ కౌన్సిలర్‌ సూర్య ప్రభ, బీఆర్‌ ఎస్‌ నియోజకవర్గం యూత్‌ ప్రెసిడెంట్‌ సోమేష్‌ యాదవ్‌, డివిజన్‌ ప్రెసిడెంట్‌ దేవరకొండ శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్‌ నాయకులు కిషోర్‌ చారి, నార్ల కంటి బాలయ్య, భాస్కర్‌ రాజు , ఉమేష్‌ , యాదగిరి , జయంచారి , జలిగం రాకేష్‌, నజీర్‌ తదితరులు పాల్గొన్నారు.
కల్వర్ట్‌ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్‌ 131 డివిజన్‌ పరిధి లోని కాకతీయ నగర్‌ మార్కెట్‌ వద్ద రూ.88 లక్షలతో చేపడుతున్న కల్వర్టు నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, అధికారులు, మాజీ కార్పొరేటర్‌ కేఎం గౌరీష్‌తో కలిసి పరిశీలించారు. ఇప్పటికీ 40 శాతం పనులు పూర్తి కావడంతో మరింత వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love