- Advertisement -
నవతెలంగాణ – బంజారా హిల్స్
ఖైతరాబాద్ నూతన జోనల్ కమీషనర్ గా ఐపీఎస్ ప్రియాంక శుక్రవారం భాద్యతలు స్వీకరించారు. విధులకు వచ్చిన ఆమె కమిషనర్ పరిధిలోని డీఎంసీలు, ఏఎంసీలు, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ, అధికారులతో పాటు ఇతర ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. అదేవిధంగా వారి పరిచయాలను తెలుసుకోవడంతో పాటు జవాబుదారీగా పనిచేయాలని ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించినట్లు సమాచారం. బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే విధుల్లో నిమగ్నమైన ఆమె తీరును అభినందిస్తూనే సమస్యల పరిష్కారానికి ఐక్యతతో పని చేయవలసిన బాధ్యత ఉందని గుర్తించారు.
- Advertisement -



