ముస్లింల కులాలను చేర్చాలి
మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. యాకూబ్ పాషా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జనగణన 2027లో భాగంగా రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన స్వీయ గణన పోర్టల్లో ముస్లింలకు చెందిన కులాల పేర్లను చేర్చాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి. యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పోర్టల్లో ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల సమాచారం మాత్రమే పొందుపరచడంతో రాష్ట్రంలోని 44,57,012 మంది ముస్లింలు జనరల్ విభాగంలో తమ కులాన్ని ఎంచుకోవాల్సి వస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. దీని కారణంగా ముస్లింలు, ఇతర వర్గాల ప్రజలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి స్వీయ గణన పోర్టల్లో ఉన్న లోపాలను సరిదిద్ది ముస్లిం వర్గాలకు చెందిన కులాలు, ఉపకులాల పేర్లను కూడా చేర్చాలని కోరారు.
స్వీయ గణన పోర్టల్లో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



