Thursday, April 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోషకాహార లోపం నివారణకై బాల భరోసా పథకం 

పోషకాహార లోపం నివారణకై బాల భరోసా పథకం 

- Advertisement -

జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి రాజేశ్వరి 
నవతెలంగాణ-అచ్చంపేట
ఐదేండ్ల లోపు చిన్నపిల్లలలో పోషకాహార లోపం నివారణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బాల భరోసా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చిన్నారులకు మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో చిన్న పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో బాల భరోసా మెడికల్ టెస్ట్ లు నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా 20 మంది చిన్నారులకు టెస్టులు నిర్వహించడం జరిగింది. పిల్లలకు ఇంతకుముందు ఏవైనా జబ్బులు ఉన్నాయా..! వివరాలను తెలుసుకొని పిల్లలకు వైద్యులు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. వైద్యులు తగిన సలహాలు సూచనలు అందించారు. చిన్నారులలో శారీరిక మానసిక వైకల్యాలు ఇతర ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  ఆస్పత్రి సూపర్డెంట్ రామ్ కుమార్, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీశైలం గౌడ్,  సిబ్బంది జంగిటి మధుబాబు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -