Tuesday, May 5, 2026
E-PAPER
Homeసినిమాఅందరికీ కనెక్ట్‌ అయ్యే కథ

అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ

- Advertisement -

హీరో సుమంత్‌ ప్రభాస్‌ నటించిన రూరల్‌ లవ్‌, ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘గోదారి గట్టుపైన’. సుభాష్‌ చంద్ర దర్శకత్వంలో రెడ్‌ పప్పెట్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించింది. నిధి ప్రదీప్‌ కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈనెల 8న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత అభినవ్‌ మీడియాతో ముచ్చటించారు. నేను 10 ఏళ్లుగా విభిన్నమైన వ్యాపారాల్లో ఉన్నాను. నాకు సినిమా అంటే ప్యాషన్‌. మంచి స్క్రిప్ట్‌ కోసం చూస్తున్న సమయంలో సుభాష్‌ చెప్పిన ఈ కథ నాకు చాలా నచ్చింది. యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్‌ అయ్యే ఎమోషన్స్‌తో ఉన్న కథ ఇది. అందుకే యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న టైటిల్‌ని ఫైనల్‌ చేశాం. ఒక నటుడు ఛాలెంజ్‌ ఉన్న పాత్ర చేయాలని కోరుకుంటాడు. తెలంగాణలో చేయడం అతనికి ఈజీ. కానీ ఈ పాత్ర కోసం సుమంత్‌ ప్రభాస్‌ గోదారి యాసను పర్ఫెక్ట్‌గా నేర్చుకుని, చాలా అద్భుతంగా నటించాడు. సునీల్‌ నారంగ్‌ నాకు శ్రేయోభిలాషి, మార్గదర్శి. ప్రతి విషయంలో సపోర్ట్‌ చేస్తారు. జగపతి బాబు, లైలా, రాజీవ్‌ కనకాల వంటి అనుభవం ఉన్న నటీనటులు నా తొలి సినిమాకే పని చేసే అవకాశం దొరికిందంటే.. కారణం సునీల్‌ ప్రోత్సాహమే. సీడెడ్‌లో తిరుపతి ప్రసాద్‌, నైజాంలో నేను, సునీల్‌, ఆంధ్రలో సురేష్‌ బాబు రిలీజ్‌ చేస్తున్నారు. 7వ తేదీ సాయంత్రం ప్రీమియర్స్‌ ప్లాన్‌ చేస్తున్నాం. సినిమా చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. ఆడియన్స్‌కు బెస్ట్‌ ప్రొడక్ట్‌ ఇస్తున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -