ప్రధానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ బహిరంగ లేఖ
తెలంగాణ పట్ల నిర్లక్ష్యం తగదంటూ హితవు
రాష్ట్ర విభజన హామీలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసింది. వాటిని అమలు చేయటంలో, రాష్ట్ర సమస్యలను పరిష్కరించటంలో ఆయన తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించింది. ఈ ధోరణిని మార్చుకుని హామీలను అమలు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ శనివారం ప్రధానికి బహిరంగలేఖ రాశారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటున్న ప్రధాని మోడీ రాష్ట్ర ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్రం ఏర్పడి పన్నెండేండ్లు కావస్తున్నా విభజన హామీల పట్ల కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లాభం పొందేందుకు ప్రయత్నం చేస్తే, తెలంగాణ ప్రజలు సహించరన్నారు. రాష్ట్రంలోని లౌకిక శక్తులన్ని దాన్ని ప్రతిఘటించేందుకు ముందుకొస్తాయి’ అని వెస్లీ హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ఆఫీసులపై, వాహనాలపై దాడులు తగదువర్సిటీకి నిధులు ఇవ్వలేదు. గిరిజన వర్సిటీకి పూర్తి నిధులు ఇవ్వకపోగా, కనీసం ఒక్క మెడికల్ కాలేజీని కూడా రాష్ట్రానికి కేటాయించలేదు. చట్ట ప్రకారం రావాల్సిన పారిశ్రామిక పన్ను రాయితీలు, జీఎస్టీ ప్రోత్సాహకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అభివద్ధిపై చర్చను పక్కనపెట్టి, మత విద్వేషాలను రెచ్చగొడుతూ తెలంగాణలో రాజకీయ లాభం పొందేందుకు లౌకిక విలువలకు భంగం కలిగిస్తున్నారు” అని జాన్‌వెస్లీ గుర్తు చేశారు.
విభజన హామీలుఅమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



