దమ్ముంటే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి చూపండి
మాజీ బిఆర్ ఎస్ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్
నవతెలంగాణ – దర్పల్లి
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నుకల దృశ్య తెలంగాణ రాష్ట్ర ఉద్యమకార్డుడు కేసీఆర్ పై సిట్ విచారణ పేరుతొ రాష్ట్ర కాంగ్రేస్ పార్టీ చేస్తున్న పని ఇది కేవలం పిరికిపంద చర్యగా వర్ణించారు. దర్పల్లి మాజీ బిఆర్ ఎస్ పార్టీ జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్, ఈ సందర్బంగా ఆయన ఆదివారం అధిష్టానం ఆదేశాల మేరకు మండలకేంద్రములోని గాంధీ విగ్రహం వద్ద కార్యకర్తలతో ధర్నా కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రజలకు గ్యారంటీల గారడితో గద్దె నెక్కిన రేవంత్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం మర్చి, కేవలం కేసీఆర్ పై బురదజల్లే పనులు చేస్తూ ఇబ్బందులకు గురించేస్తుందని ఆగ్రహం వెక్తం చేశారు.
దమ్ముంటే కేసీఆర్ ను అరెస్టు చెయ్యాలని సర్కార్ పై సవాలు విసిరారు. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ ఓడిపోతుందని గ్రహించి, తమ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వారిపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇబ్బందులకు గురించేయడం రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారానిన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఆడుతున్న నాటకమని అన్నారు.మానాయకుడు తెలంగాణ తెచ్చినోడు ఉద్యమాన్ని వెనక ఉండి నడిపించిన వేక్తి, ఈరోజు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఈ నాయకులే గ్రామాలనుండి పట్టణాలకు తండపతండాలుగా పట్టణాలకు వెళ్లి, బిఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని మున్సిపాలిటీల్లో తమ పార్టీ సత్తా చాటుతుందని అన్నారు.
ఓటమి భయంతో తమ పార్టీ అభ్యర్థులను ఇబ్బందులకు గురించేస్తున్నారని, కిడ్నప్ లు చేస్తున్నారని,ఎన్ని ఇబ్బందులు చేసిన మున్సిపల్ లల్లో బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని అన్నారు. ప్రలు మాపార్టీ వెంట ఉన్నారని అన్నారు. కార్యక్రములో మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, మాజీ ఎంపీపీ నల్ల సారిక హన్మంత్పీ రెడ్డి, పిసు రాజపాల్, కిషోర్ రెడ్డి,అబ్దుల్ మజీద్, నాజిర్, ఎస్పీ లింగం, పార్వతి రమేష్ గౌడ్, లోలం రాజేశ్వర్, చెప్యాల భూమేష్, సభవత్ శ్రీనివాస్, చెలిమేల రంజిత్,మోహన్, సభవత్ నరేందర్, గోపాల్, శివరాం, తదితరులు పాల్గొన్నారు.



