Thursday, May 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్  ఎటిఎం నుంచి డ్రా చేస్తే చినిగిన నోట్ల కలకలం

  ఎటిఎం నుంచి డ్రా చేస్తే చినిగిన నోట్ల కలకలం

- Advertisement -

– ఇబ్బందులకు గురైన ఖాతాదారులు
– సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ 
నవతెలంగాణ – వరంగల్ 
: హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డు ప్రక్కన గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం నుంచి దేవునూరి సరిత రూ 37 వేలను డ్రా చేయగా అందులో రూ.31 వేలకు సంబంధించిన  62 ఐదువందల రూపాయల నోట్లు చినిగినవి రావటంతో ఒక్కసారి అవక్కైనారు. బక్రీద్ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు కావడం తో ఏటీఎం కి వెళ్లి మనీ విత్ డ్రా చేయడానికి వెళితే ఆ ఏటీఎంలో నోట్లు చినిగిపోయిన నోట్లు వచ్చాయని ఆమే విచారం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరం ఉంది ఏటీఎం కి వెళ్లి డ్రా చేస్తే ఇలా చినిగిపో యిన నోట్లు రావడం వల్ల చాలా ఇబ్బందులకు గురైనామని తెలిపారు. ఇంత నిర్లక్ష్యం గా వ్యవహరించిన సంబంధించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆమే డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -