– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
– నాట్కో యూనియన్ జనరల్ బాడీ సమావేశం
నవతెలంగాణ-కొత్తూరు
ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసి కార్మికుల ఐక్యతను చాటాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని బుధవారం నాట్కో యూనియన్ నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీబీఆర్‌ఏఎమ్ జీ పథకం, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లు రద్దుకై సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని అన్నారు. కార్మికులను కట్టు బానిసలుగా చేసే వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తి రక్షణ ఆరోగ్య పని పరిస్థితుల కోడ్‌లను రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టం రూపొందిందని అన్నారు. ఉపాధి హామీ కింద రూ.26.56 కోట్ల మంది పని చేస్తున్నారని చెప్పారు. దళితులు 18.63శాతం, గిరిజనులు 17.32శాతం ఉపాధి పొందుతున్నారని అన్నారు. కార్మికులకు, ప్రజలకు నష్టం చేసే నూతన చట్టాలను రద్దు చేయాలని, లేని పక్షంలో దేశంలోని కార్మిక, కర్షక ఐక్యతతో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్.రాజు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.మల్లేష్, జిల్లా నాయకులు బీస సాయిబాబు, నాట్కో యూనియన్ ప్రధాన కార్యదర్శి జైపాల్‌రెడ్డి, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సమ్మెతో కార్మిక వర్గ ఐక్యతను చాటుదాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



