నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని బషీరాబాద్ గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో ఆదివారం ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మెంబర్ గా నియమితులైన బాస వేణుగోపాల్ యాదవ్ ను ఘనంగా సత్కరించారు. సర్పంచ్ బైకాన్ జమున మహేష్, ఉప సర్పంచ్ చిలివేరి భూమేశ్వర్, పాలకవర్గ సభ్యులు రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యుడు బాస వేణుగోపాల్ యాదవ్ ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తన పదవి కాలంలో ఉత్తమ సేవలు అందించడం ద్వారా వేణుగోపాల్ యాదవ్ పేరు ప్రఖ్యాతలు పొందాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. మండలానికి చెందిన వ్యక్తి రాష్ట్ర స్థాయి పదవిని అలంకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు నెల్ల రమేష్, బందెలా రాజు, అంకడి శేఖర్, దొన్ పాల్ రవి, నాయకులు ఏనుగు గంగారెడ్డి, నర్రా భూమేశ్వర్, బైకని ముకేష్, ప్రశాంత్, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యుడికి సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



