Sunday, May 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తను నీతిగా బ్రతుకుతు సమాజ హితం కోసం పనిచేయాలి

తను నీతిగా బ్రతుకుతు సమాజ హితం కోసం పనిచేయాలి

- Advertisement -

 నవతెలంగాణ – ఆలేరు టౌన్ : తాను నీతిగా, నిజాయితీగా బ్రతుకుతూ సమాజా  హితం  కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని, విద్యాబోధన చేయడం తనకు సంతృప్తికరమని, శ్రీ రామకృష్ణ విద్యాలయం కరస్పాండెంట్, బండి రాజుల, శంకర్ అన్నారు. ఆలేరు పట్టణంలో దినేష్ గార్డెన్ లో ఆదివారం 2025, 26 సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వివిధ దేశాల నుండి వలస వచ్చిన వారి పాలనలో , మనం బానిసలుగా బ్రతకాల్సి  వచ్చిందని చెప్పారు. ఎందరో త్యాగదనుల ఉద్యమాలతో తిరిగి స్వాతంత్రం సిద్ధించిందన్నారు. మంచి పేరు ప్రతిష్టాలు గల వ్యక్తులు దేశ నిర్మాణంలో భాగస్వాములు  కావాలన్నారు. క్రమశిక్షణతో ఎదిగిన  వివేకానందుడు మన దేశ  గొప్పతనాన్ని  విదేశాలలో చాటారన్నారు. ప్రపంచానికి మన దేశం, జ్ఞానం అందించిందని వివరించారు. తినడానికి తిండి ఉంటే చాలని, నిజాయితీగా బ్రతకడం అవసరమన్నారు. క్రమశిక్షణకు, సంస్కారానికి మారుపేరుగా శ్రీ రామకృష్ణ విద్యాలయం, విద్యార్థులు ఎదగాలన్నారు.  దేశం, మెరుగైన సమాజం కోరుతూ , ధర్మం  న్యాయాన్ని  కాపాడాలని, తల్లిదండ్రులను గురువులను, మర్చిపోవద్దని ఇతవు పలికారు. 

నేటి పాలకులు చెప్పేది ఒకటి చేసేదొకటని  ప్రస్తుత  రాజకీయ పరిస్థితుల గురించి  వివరించారు. మాతృభాషను పక్కనపెట్టి, ఇంగ్లీష్ వెంట పడుతున్నారని, ఇంగ్లీషులో ఉపయోగించుకుంటూనే, మాతృభాషకు పెద్దపీట వేయాలని సూచించారు. ప్రపంచ దేశాలలో మన విద్యా వ్యవస్థని, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ  ఉన్నారని గుర్తు చేశారు.  మాతృభాష తల్లి లాంటిదని,  పరిరక్షించుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత స్థానాలలో ఉన్నప్పుడే, గురుదక్షిణ చెల్లించినట్లు అవుతుందన్నారు. విద్యార్థులకు బోధన చేయడం ద్వారా  ఆచార్యులు నిత్య విద్యార్థులని తెలియజేశారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం లో 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి చేరిన పూర్వ  విద్యార్థులు గత కాలపు తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,చదువుకున్న పాఠశాలను, తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. వందేమాతరం గీతంతో ప్రారంభమై,జ్యోతి ప్రజ్వలన అనంతరం దివంగత బీమాగాని దివ్యభారతీ,బర్ల సంపత్‌లకు నివాళులర్పించారు. ఉపాధ్యాయురాలు గుగ్గిళ్ల జయమ్మ,బోడిగం వెంకట్ రెడ్డి, బూడిద దీపక్, అల్వాల ప్రసాద్,పోతుగంటి సంపత్‌కుమార్, చింతకింది  కృష్ణ,అలె ప్రభ, గుడుకుంట్ల యాకుబ్, గడసంతల భాస్కర్ హాజరయ్యారు. పూర్వ విద్యార్థుల ఆలేటి మల్లేశం, పరిగెల జయంతి సమావేశానికి అధ్యక్షత వహించారు. పూర్వ విద్యార్థులు కౌన్సిలర్ జూకంటి సంపత్,బాల్ దే కృష్ణ , ఆలేటి సంతోష్, కందుకూరు మల్లేష్, తోట మాధురి, చిమ్మి మమత, కర్రే జగన్మోహన్, శ్రీకాంత్, ఆలేటి  స్రవంతి, చెక్క రాజు పూర్వ విద్యార్థుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -