ఆరుగురిని కాల్చి చంపిన వ్యక్తి
నిందితుడూ మృతి
కుటుంబ వివాదాలే కారణమని
ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
మస్కటీన్: అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. అయోవా రాష్ట్రంలోని మస్కటీన్ నగరంలో సోమవారం జరిగిన వరుస కాల్పుల్లో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కాల్పులకు పాల్పడిన నిందితుడు కూడా ఉన్నాడు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం ఆ రక్తపాతానికి కార ణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మస్కటీన్ పోలీసు విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, స్థానిక కాల మానం ప్రకారం మధ్యాహ్నం 12.12 గంటల సమయంలో 210 పార్క్ అవెన్యూలోని ఓ నివాసంలో కాల్పులు జరిగినట్లు అత్యవసర సమాచారం అందడంతో పోలీసులు, అత్యవ సర వైద్య సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకు న్నారు. ఇంట్లోకి ప్రవేశించగానే తుపాకీ గాయాలతో మృతి చెందిన నలుగురిని గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి మస్కటీన్‌కు చెందిన ర్యాన్ విల్లీస్ మెక్ ఫార్లాండ్ (52)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే అతడు పరారైనట్లు వెల్లడించారు. అతడి కోసం ప్రత్యేకబృందాలు గాలింపు ప్రారంభించాయి. కొద్దిసేపటికే నగరంలోని రివర్‌ఫ్రంట్ ట్రయిల్ ప్రాంతంలో, పాదచారుల వంతెన సమీపంలో మెక్ఫార్లాండ్ను పోలీసులు గుర్తించారు. అక్కడ తుపాకీతో తనను తాను కాల్చుకున్న స్థితిలో అతడు కనిపించాడు. వెంటనే వైద్యసాయం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అధికారులు తెలిపారు. మరోవైపు దర్యాప్తు కొనసాగుతున్న సమయం లో మరో రెండు ప్రాంతాల్లో కూడా కాల్పుల బాధితులు బయటపడ్డారు.
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



