Friday, June 5, 2026
E-PAPER
Homeకరీంనగర్పర్యావరణ పరిరక్షణ ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత

- Advertisement -

సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.లక్ష్మణాచారి
నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల
పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి  సామాజిక బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి పి. లక్ష్మణాచారి  అన్నారు.జిల్లా న్యాయ సేవాధికర సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రకృతి వనరులను సంరక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం న్యాయమూర్తి  న్యాయవాదులతో కలిసి కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటయ్య, సీనియర్ న్యాయవాది రవీందర్ రావు, ప్రభుత్వ న్యాయవాది కళ్యాణ్ చక్రవర్తి, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, న్యాయవాదులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -