అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై మధ్యంతర ప్రకటన విడుదల
తుది నివేదికకు గడువు ప్రకటించని ఏఏబీబీ
న్యూఢిల్లీ : అహ్మదాబాద్‌లో 260మంది మృతికి కారణమైన ఘోర విమాన ప్రమాదానికి శుక్రవారంతో ఏడాది పూర్తయింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల వ్యవధిలోనూ కూలి నేలమీదున్న 19మందితో సహా మొత్తంగా 260మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తు పురోగతిపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏబీబీ) శుక్రవారం మధ్యంతర నివేదికను విడుదల చేసింది. అన్ని దర్యాప్తు కార్యకలాపాలు, అవసరమైన అంతర్జాతీయ సమీక్షలు, సంప్రదింపుల ప్రక్రియలు ముగిసిన అనంతరం ఈ ఘోర దుర్ఘటనపై తుది దర్యాప్తు నివేదిక విడుదలవుతుందని ఎఎఐబి పేర్కొంది. అయితే తుది నివేదిక ఇచ్చేందుకు ఎలాంటి గడువును ప్రకటించలేదు. నేర్చుకోవాల్సిన గుణపాఠాలను గుర్తించి, భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయడం ద్వారా పౌర విమానయాన భద్రతను పెంపొందించడం ఈ ప్రమాద దర్యాప్తు యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఏఏబీబీ పేర్కొంది.
అంతేకానీ ఎవరిని నిందించాలి, ఎవరిని బాధ్యులను చేయాలనేది లక్ష్యం కాదని స్పష్టం చేసింది. విమాన వ్యవస్థలు, ఫ్లైట్‌రికార్డర్ డేటా, ఇంజన్ సంబంధిత విడిభాగాలు, నిర్వహణ, నిర్వహణా రికార్డులు, ఇతర సాక్ష్యాధారాల పరిశీలన, విశ్లేషణకు సంబంధించి గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొంది. గతేడాది జులై 12న ప్రాధమిక నివేదికను విడుదల చేశారు. గత ఏడాది కాలంగా దర్యాప్తు బృందం ఈ ప్రమాదానికి సంబంధించిన సంబంధిత సాంకేతిక, నిర్వహణా, వ్యవస్థాగత, మానవతా కారణాలను విస్తృతంగా, ముమ్మరంగా పరిశీ లించిందని తెలిపింది. సంబంధిత సాంకేతిక నిపుణులు, ప్రతి నిధులు, సలహాదారులు , ఆయా అంశాలకు సంబంధించిన సంస్థలు, వ్యక్తులు అందరూ ఈ బృహత్తర కృషిలో పాల్గొన్నారని తెలిపింది. ఈలోగా మీడియా, ప్రజలతో సహా సంబంధిత వర్గాల వారెవరూ కూడా ముందుగానే ఒక నిర్ధారణకు రావద్దని కోరింది.
నిందితులు,బాధ్యులెవరు అన్నది లక్ష్యం కాదు !
- Advertisement -
- Advertisement -



