Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేజీబీవీ పాఠశాలను సందర్శించిన జిల్లా పరిషత్ సీఈఓ

కేజీబీవీ పాఠశాలను సందర్శించిన జిల్లా పరిషత్ సీఈఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని కేజీబీవీ గురుకుల పాఠశాల ను కామారెడ్డి జిల్లా జడ్పి సీఈఓ చంద్ర నాయక్ శుక్రవారం సందర్శించారని బస్వాపూర్ గ్రామ సర్పంచ్ రమణ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా కస్తూర్బా పాఠశాలల్లోని విద్యార్థినిలతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భోజనశాలను , స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులను భోజనాలు పెట్టాలని ప్రత్యేక అధికారికి ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలలు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినిలకు సన్మానించారు. కేజీబీవీ విద్యార్థినిలకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ తో పాటు జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, బస్వాపూర్ సర్పంచ్, ఉప సర్పంచ్,  సూపరింటెండెంట్ క్రాంతి కుమార్, సిబ్బంది, మధు, గంగాధర్, జిపి కార్యదర్శి భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -