- Advertisement -
మాజీ సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇస్లాం మతస్తులు పవిత్రంగా భావించే రంజాన్ మాస ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు బీఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఉపవాస దీక్షలతో, ప్రత్యేక ప్రార్థనలతో, దైవభక్తితో సాగే రంజాన్ మాసంలో ఆధ్యాత్మికత, భక్తి భావన వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నగరం గంగా జమున తహజీబ్‌కు దర్పణంగా నిలుస్తుందని తెలిపారు. ఈ ఉపవాస దీక్షల సందర్భంగా ప్రజల మధ్య శాంతి సామరస్యాలు, సౌభ్రాతృత్వ భావనలు మరింత పెంపొందాలని ఆకాంక్షించారు.
- Advertisement -



